Tadipatri Assembly Election 2024 Results LIVE: తాడిపత్రిలో తాడోపేడో తేలిపోవాలి
తాడిపత్రి అసెంబ్లీ ఎన్నికల 2024 ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం: రాయలసీమ ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తాడిపత్రిని ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. సుమారు నాలుగు దశాబ్ధాలుగా తాడిపత్రి కేంద్రంగా ఉమ్మడి అనంతపురం జిల్లాను ఏకఛత్రాధిపత్యంగా జేసీ బ్రదర్స్ ఎలారు. అలాంటి జేసీ బ్రదర్స్ రాజకీయానికి 2019లో వైసీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి బ్రేక్ వేశారు.
సిమెంట్ ఫ్యాక్టరీల, నాపరాళ్ల ఫ్యాక్టరీలు ఇక్కడ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అయితే తాడిపత్రిలో మెజారిటీ ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. తాడిపత్రి, పెద్దవడుగూరు, యాడికి, పెద్దపప్పూరు మండలాలు ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. 1985లో మొదలైన జేసీ బ్రదర్స్ శకం 2014 వరకు ఎదురు లేకుండా సాగింది. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ దివాకర్ రెడ్డి మంత్రిగానూ చక్రం తిప్పారు. తాడిపత్రిలో మరోసారి గెలవాలని వైఎస్. జగన్ పట్టుదలగా వున్నారు.

ఈసారి జేసీ అస్మిత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు టీడీపీ టికెట్ ఇవ్వడంతో ఆ ప్రాంతంలో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి పేరు చెప్పగానే.. ఫ్యాక్షన్ రాజకీయాలు, జేసీ బ్రదర్స్ గుర్తొస్తారు. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ రాజకీయాలు ఓ లెక్కలో సాగితే తాడిపత్రిలో రాజకీయాలు మరోలా వుంటాయి. ఉద్యానవన పంటలకు కేంద్రంగా తాడిపత్రి నిలిచింది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయాన్ని ఇక్కడి రైతులు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.
తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 3,34,741 మంది ఓటర్లున్నారు. గతంలో తాడిపత్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీదే ఆధిపత్యం. జేసీ దివాకర్ రెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌కు నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చారు. 1985లో మొదలైన జేసీ బ్రదర్స్ శకం 2014 వరకు ఎదురు లేకుండా సాగింది. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివాకర్ రెడ్డి మంత్రిగానూ చక్రం తిప్పారు.
కాంగ్రెస్ పార్టీ తాడిపత్రిలో పది సార్లు, టీడీపీ రెండు సార్లు, ఇతరులు రెండు సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించాయి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జేసీ కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరింది. ఆ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా, జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి కేతిరెడ్డి పెద్దారెడ్డికి 92,912 ఓట్లు, టీడీపీ అభ్యర్ధి జేసీ అస్మిత్ రెడ్డికి 85,400 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 7,533 ఓట్ల మెజారిటీతో తాడిపత్రిలో గెలిచి తొలిసారిగా తాడిపత్రిలో పాగా వేసి జేసీ బ్రదర్స్ కు చెక్ పెట్టారు.
2024 ఎన్నికల విషయానికి వస్తే మరోసారి తాడిపత్రిలో గెలవాలని వైఎస్ జగన్ పట్టుదలగా వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మరోసారి వైసీపీ టికెట్ కేటాయించడంతో ఆయన పోటీ చేశారు. టీడీపీ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో జరిగిన తప్పులకు తావివ్వకుండా పూర్తి స్థాయిలో పట్టు బిగించారు జేసీ బ్రదర్స్. 70 ఏళ్ల వయసులోనూ నియోజకవర్గం మొత్తం తిరుగుతూ తన అనుచర వర్గాన్ని సమాయత్తం చేశారు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈసారి జేసీ అస్మిత్ రెడ్డికి చంద్రబాబు టికెట్ ప్రకటించడంతో ఆయన పోటీ చేశారు.
పోలింగ్ మరసటి రోజు తాడిపత్రిలో జరగిన గొడవల కారణంగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో 7,533 ఓట్లతో విజయం సాధించిన పెద్దారెడ్డి మరోసారి తాను ఎమ్మెల్యే అవుతానని ధీమాగా ఉన్నారు. తాడిపత్రిని కంచుకోట చేసుకున్న జేసీ బ్రదర్స్ ఈసారి విజయం మాదే అని ధైర్యంగా ఉన్నారు. అయితే జూన్ 4వ తేదీన కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిల జాతకాలు తెలిసిపోతాయని తాడిపత్రి ప్రజలు అంటున్నారు. ముందుజాగ్రత్త చర్యగా తాడిపత్రిలో కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలను రంగంలోకి దింపుతున్నారు.












Click it and Unblock the Notifications