జైల్లో జగన్, ఇంట్లో కిరణ్ జైలు జీవితం: తలసాని ఎద్దేవా

Talasani Srinivas Yadav
హైదరాబాద్: రాష్ట్రంలో ఒకరు జైలులో ఉంటే, మరొకరు నాలుగు గోడల మధ్య ఉండి జైలు జీవితం గడుపుతున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలను ఉద్దేశించి గురువారం అన్నారు. బుధవారం పొలిట్ బ్యూరోలోకి తలసానిని తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రాన్ని అధికార కాంగ్రెసు పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. ప్రజలు ఇప్పుడు తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు వైపు చూస్తున్నారన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కీలుబొమ్మగా మారారని ఎద్దేవా చేశారు. జగన్ జైలులో ఉంటే, కిరణ్ నాలుగు గోడల మధ్య జైలు జీవితం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.

కాగా, టిడిపిలో అధ్యక్షుడి తర్వాత కీలకమైన నిర్ణయాత్మక పదవి పొలిట్ బ్యూరో. అంతటి అత్యున్నత పదవి నగరానికి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను బుధవారం వరించింది. చంద్రబాబు ఆయనను పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న పలువురు నాయకులు తలసానిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో అత్యున్నత పొలిట్ బ్యూరో సభ్యుడుగా పని చేయాలని తలసాని పదేళ్ల నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే చిన్నవాడు కావడం, పోటీ కూడా ఎక్కువ ఉండటంతో ఆయనకు అవకాశం రాలేదు. గతేడాది జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే సమయంలోనే పొలిట్ బ్యూరోలోకి అవకాశం ఇవ్వాలని బాబును అడిగారు. ఆయన హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+