కెసిఆర్!నీ తాటతీస్తా, మీ ఆంధ్రా దందా మాటేంటి: పవన్
వరంగల్/కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శనివారం నిప్పులు చెరిగారు. బిసిలను తిడితే తాటతీస్తానని హెచ్చరించారు. మోడీ పక్కన అటు, ఇటు ఆంధ్రా వాళ్లు అని చెబుతున్న కెసిఆర్.. కుటుంబ సభ్యులు ఆంధ్రా వాళ్లతో కలిసి వ్యాపారం ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు. తనకు తెలంగాణ అంటే చాలా ఇష్టమన్నారు. తనకు ఈ గడ్డ పునర్జన్మను ఇచ్చిందన్నారు.
వరంగల్ నడి బొడ్డు నుండి చెబుతున్నానని, బిసి, ఎస్సీలను అవమానించేలా వ్యవహరిస్తే కెసిఆర్ తాట తీస్తానన్నారు. ప్రధానికాగల అవకాశమున్న నరేంద్ర మోడీ వంటి బిసి నేతను నోటికొచ్చినట్లు తిట్టడం కెసిఆర్‌కు తగదన్నారు. సభలో అమరులకు నివాళులు అర్పించారు. బిసి కులానికి చెందిన మోడీని కెసిఆర్ తన ఇష్టం వచ్చినట్లు విమర్శించడం తగదన్నారు. తిట్టడంలోనే ఆయనకు కిక్కుందేమోనని ఎద్దేవా చేశారు.
చవటలు, దద్దమ్మలు, సన్నాసులు అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడటం అలవాటుగా మారిందన్నారు. ఎస్సీ, బిసిలను విమర్శిస్తే సహించేబోనని, వరంగల్‌లో కూర్చొని కెసిఆర్ తాట తీస్తానన్నారు. తెలంగాణ అభివృద్ధి కంటే ఆయన కుటుంబసభ్యులకు పదవులు, ఆస్తుల సంపాదనే ముఖ్యమన్నారు. బేటా, బేటీ, దామాద్ పద్ధతిలో కెసిఆర్ దందా కొనసాగుతుందనన్నారు. కెసిఆర్ కుటుంబ దందాలను ప్రజలు గమనించాలని పవన్ కోరారు.
కెటిఆర్ గుంటూరు జిల్లాలో చదువుకున్నారని, తెలంగాణలో ఆంధ్రవారిని విమర్శిస్తూ ఆంధ్రకు వెళ్లిన తర్వాత.. అలా తిట్టడం మామూలేనని చెబుతూ వారితో కలిసి దందాలు చేసిన వ్యక్తి కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణతో హరీశ్ కేబుల్ బిజినెస్ ఎలా చేస్తున్నారన్నారు. కెసిఆర్ కుమార్తె కవిత వసూలు చేసిన డబ్బుకు లెక్కేలేదన్నారు. తాను వైయస్ భూదందాల పైనా గొంతెత్తానన్నారు. తెలంగాణకు ఎవరు అన్యాయం చేసినా ప్రశ్నిస్తానన్నారు.

తెలంగాణ అంటే తనకెంతో ఇష్టమని, ఆంధ్రాలో జన్మిస్తే.. ఇక్కడే పునర్జన్మ పొందానన్నారు. తెలంగాణ పోరాటం సమయంలో సినీ నటుడిగా తాను నాలుగు గోడల మధ్య కూర్చొని తెలంగాణ కోసం ఆలోచించానన్నారు. తెరాసకు చెందినవారు తన మామిడి తోటపై దాడి చేసి పశువులను సైతం చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సినిమాకు తీన్‌మార్ టైటిల్ పెట్టవద్దని బెదిరించారన్నారు. సినిమా రీళ్లను తగులపెట్టినప్పటికీ నోరు విప్పలేదని పేర్కొన్నారు.
అయితే అది కెసిఆర్ కుటుంబానికి భయపడికాదని, ప్రజల కోసం మౌనం వహించానన్నారు. కెసిఆర్ ఒక్కడితోనే తెలంగాణ ఏర్పడలేదని, ఇద్దరు ఎంపీలుంటే ఏర్పడుతుందా అని ప్రశ్నించారు. ప్రతి జిల్లాలో యువకుల పోరాటం, ఎర్రబెల్లి లాంటి తెలంగాణ వాదుల పోరాటంవల్లే వచ్చిందన్నారు. దళితుడిని సిఎం చేస్తానని ప్రకటించి తెలంగాణ ఏర్పడ్డాక తానే సిఎం కావాలని ఆరాటపడుతున్నారంటూ దుయ్యబట్టారు.
తెరాసను గెలిపిస్తే తెలంగాణకు అన్యాయమే అన్నారు. మోడీకి మద్దతిస్తే ఆంధ్రోడిని అనడం ఏమిటని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించే దమ్ము కాంగ్రెసు పార్టీకి లేదన్నారు. తానెక్కడికి వెళ్లినా విప్లవకారుడు చేగువేరా పుస్తకం తనవెంట ఉంటుందన్నారు. మనిషిని ప్రేమించడానికి కులం, ప్రాంతం, మతం అవసరం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ బిజెపి వల్లే వచ్చిందని, బంగారు తెలంగాణ ఆ పార్టీతోనే సాధ్యమన్నారు.
నిద్రలేచినప్పటి నుంచి అందర్నీ తిట్టడంలోనే కేసీఆర్‌కు కిక్కుందన్నారు. రాష్ట్రం విడిపోయినా, తెలుగువారుగా కలిసుందామని, విద్వేషాలు రెచ్చగొడితే బంగారు తెలంగాణను తీర్చిదిద్దుకోవడం అసాధ్యమన్నారు. ఒక ఎంపీ సీటుకు కేసీఆర్ రూ.30 కోట్లు వసూలు చేశాడని ఆరోపించారు. తెలంగాణపై కాంగ్రెస్ ఊగిసలాటలో ఉంటే బిజెపి ఒక్క గుద్దు గుద్దితేనే ఇచ్చిందే తప్ప, తెరాస పాత్ర ఏం లేదన్నారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications