కౌంటర్: ఏపిలో తమిళ బస్సులు అడ్డుకున్నారు
చిత్తూరు: శేషాచలం ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందని బస్సులను అడ్డుకుంటున్న నేపథ్యంలో ఏపికి వచ్చే తమిళనాడు బస్సులను అడ్డుకున్నారు చిత్తూరు జిల్లా వాసులు. శనివారం వరదాయిపాలెంలో తమిళనాడుకు చెందిన బస్సులను ప్రజలు అడ్డుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బస్సులను తమిళనాడులో అడ్డుకుంటున్నందుకే ఈ విధంగా నిరసన చేపట్టామని తెలిపారు. ఏపి బస్సులను తమిళనాడులోకి రానివ్వకుంటే సోమవారం నుంచి తమిళనాడు నుంచి వచ్చే అన్ని బస్సులను ఏపిలోకి రానీయకుండా అడ్డుకుంటామని వరదాయిపాలెం వాసులు తేల్చి చెప్పారు.

అంతేగాక, ఈ మేరకు చెన్నైలోని కోయంబేడు డిపోకు గ్రామస్తులు ఓ లేఖను కూడా పంపించారు. ఏప్రిల్ 7న శేషాచలంలో అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తమిళనాడుకు చెందిన 20మంది కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ ఎన్‌కౌంటర్ బూటకమని పేర్కొంటూ తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు, సంఘాలు గత కొన్ని రోజులుగా ఏపి బస్సులను తమిళనాడుకు రాకుండా అడ్డుకుంటున్నాయి. అంతేగాక, ఘటన జరిగిన తర్వాతి రోజునే ఏపి బస్సులను ధ్వంసం చేయడంతోపాటు, ఏపికి చెందిన వారి దుకాణాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications