హైదరాబాద్‌లో సంతోషం, అవసరం లేదేమో: బాబు ప్రభుత్వంపై తమ్మారెడ్డి సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై టాలీవుడ్ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చి ఏదో చేస్తుందని, చించేస్తుందని అనుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు.

కానీ చేసింది ఏమీ లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం నవ్యాంధ్రలో ప్రభుత్వంతో అవసరం లేదని చెప్పారు. తమ అవసరం ప్రభుత్వానికి లేనట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. తమ అవసరం వచ్చినప్పుడు మాట్లాడుతామని చెప్పారు.

సినీ పరిశ్రమ తరలి రావాలని లేదు

సినీ పరిశ్రమ తరలి రావాలని లేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సినీ పరిశ్రమ తరలి రావాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని తమ్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హైదరాబాదులో సినీ రంగం సంతోషంగానే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, సినీ పరిశ్రమ విశాఖకు తరలి రావాలని కొందరు చాలా రోజులుగా కోరుతున్న విషయం తెలిసిందే.

సినీ పరిశ్రమ అవసరం లేదేమో

సినీ పరిశ్రమ అవసరం లేదేమో

విశాఖపట్నంను ఫిలిం హబ్‌గా అభివృద్ధి చేయాలంటే ముందుగా ప్రభుత్వానికి అలాంటి ఆసక్తి ఉండాలని తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే సినీ పరిశ్రమ అవసరం లేనట్లుగా ఉందన్నారు. తమ్మారెడ్డి విశాఖలో నిర్వహించిన వైజాగ్ ఫెస్ట్‌లో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కనీసం కోరలేదు కూడా

కనీసం కోరలేదు కూడా

వైజాగ్ ఫెస్ట్‌లో నిర్వహించిన షార్ట్ ఫిలిం కాంటెస్టుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వానికి సినీ పరిశ్రమను విశాఖకు తీసుకు వచ్చే ఆలోచన లేదన్నారు. కనీసం రావాలని కోరిక కూడా లేదన్నారు. ప్రభుత్వానికే అలాంటి కోరిక లేనప్పుడు తాము ఎందుకు వస్తామని ప్రశ్నించారు.

నంది అవార్డుల వివాదం

నంది అవార్డుల వివాదం

కాగా, ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల ప్రకటన వివాదానికి కారణమైన విషయం తెలిసిందే. టీడీపీ అనుకూలురుకు, ఓ వర్గానికే ఎక్కువగా అవార్డులు వచ్చినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో సినీ పరిశ్రమలో కొందరు అనుకూలంగా, కొందరు వ్యతిరేకంగా మాట్లాడారు. దీనిపై చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సోమవారం ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఓసారి జ్యూరీ అవార్డులు ఇచ్చేసిన తర్వాత దాని గురించి మాట్లాడకూడదన్నారు. తామంతా కూడా సినిమాలు తీశామని, పోటీలకు పంపించామని చెప్పారు. రావాల్సిన సినిమాకు అవార్డు రాలేదని, అప్పుడు మేం కూడా ప్రెస్ మీట్లు పెట్టి గోల చెయ్యలేదన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tammareddy Bharadwaj make hot comments on Andhra Pradesh Government on Monday in Vishakhapatnam Vizag Fest.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి