వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు మక్కెలిరగ్గొడతారా? అదేం భాష, ఎవరూ ఊరుకోరు: తమ్మారెడ్డి ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

Recommended Video

పిచ్చి పిచ్చి భాష మాట్లాడకండి...ఇవి చంద్రబాబు నేరిపిస్తున్నాడా ?

హైదరాబాద్: ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు అనుసరిస్తున్న వైఖరిపై ప్రముఖ సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మరువకముందే ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని తమ్మారెడ్డి భరద్వాజ 'నా ఆలోచన'లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదననెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

సినిమా వారిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరికాదని ఆయన టీడీపీ నేతలకు హితవు పలికారు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

ఎవరూ ఊరుకోరు..

ఎవరూ ఊరుకోరు..

‘ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యక హోదా కోసం ఉద్యమం జరుగుతోంది. ఇప్పుడిప్పుడే వేగం పెరుగుతోంది. ఈ టైంలో నిన్న ఎమ్మెల్సీగారు ఒకరు మాట్లాడారు. నేడు ఏపీ స్పెషల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంట.. ఈయన చలసాని శ్రీనివాస్ గారిని సంబోధిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ఇతను మాట్లాడే భాష చూడండి. నాలుగు సంవత్సరాల నుంచి ఒక మనిషి ఉద్యమం చేస్తుంటే ఆ మనిషి చేసేది నాటకమని ఇతను చెప్తున్నాడు. నాలుగేళ్ల నుంచి వీళ్లెవరూ చేయకుండా ఇప్పుడు సడెన్‌గా... మొదలెట్టిన వీళ్లది నాటకం అంటే ఎవరూ ఊరుకోరండి' అని తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు.

బాబూ.. ఛండాలంగా తిడుతున్నారు..

బాబూ.. ఛండాలంగా తిడుతున్నారు..

‘చంద్రబాబునాయుడు గారికి నేను చెప్పేదేంటంటే.. ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల్ని అతని పేరు చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. నేనతని పేరు చెప్పను. అతని పేరు ఉచ్ఛరించి అతన్ని పెద్దవాణ్ని చేయడం కూడా నాకిష్టం లేదు. ఇటువంటి వాళ్లందర్నీ తీసుకొచ్చి.. నిన్న పిచ్చి పిచ్చి భాషతో ఎమ్మెల్సీగారు మాట్లాడారు. ఇవాళ ఇంకొకతను.. ఇతను ఎన్ఆర్ఐ రిప్రజెంటేటివ్ అట. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కి రిప్రజెంటేటివ్ అంట. గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ అంటే ఒక హోదా కలిగిన వ్యక్తులు. దిగజారుడు మాటలు మాట్లాడుతూ.. ఉద్యమంలో ఉన్నవాళ్లను ఛండాలంగా తిడుతున్నారు' అని తమ్మారెడ్డి తెలిపారు.

 ముఖ్యమంత్రి మక్కెలు కూడా విరగ్గొడతారా?

ముఖ్యమంత్రి మక్కెలు కూడా విరగ్గొడతారా?

‘ఐతే కళా వెంకట్రావుగారు ఉద్యమాన్ని, రాస్తారోకోను సపోర్ట్ చేశారు. మరి ఈయన మక్కెలు కూడా ఆయన విరగ్గొడతారా? కళా వెంకట్రావు సపోర్ట్ చేశారు అంటే ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేస్తేనే చేస్తారు లేదంటే సొంతంగా కళా వెంకట్రావుగారు సపోర్ట్ చేయరుగా.. అతను ముఖ్యమంత్రి గారి మక్కెలు కూడా విరగ్గొడతాడా? వెళ్లి విరగ్గొట్టమనండి.. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు సన్మానం చేశాడు. ఉగాది పురస్కారం కూడా అందజేశారట ఈయనకు. ఈయన వెళ్లి మక్కెలిరగ తంతానని చలసాని శ్రీనివాస్‌రావును అన్నాడు ఎందుకు.. ఇవాళ ఉద్యమానికి పిలుపిచ్చారు కాబట్టి' అని తమ్మారెడ్డి చెప్పారు.

 బాబూ.. మీకిది బ్యాడ్ నేమ్

బాబూ.. మీకిది బ్యాడ్ నేమ్

కాగా, ‘ఇదేమైనా పద్ధతిగా ఉందా? ఉద్యమం జరుగుతుంటే మనం ఒకళ్లనొకళ్లం కలుపుకుని వెళ్లటానికి ప్రయత్నించాలి కానీ.. నోరుంది కదాని ఎవర్ని పడితే వాళ్లను తిట్టడానికి.. లేదంటే మనకు పదవులిచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పేరు సంపాదించుకుందామని ఇలా తొత్తులుగా.. బానిసలుగా బతికే వాళ్లందరినీ దగ్గరకు తీయడం వల్ల చంద్రబాబు నాయుడు గారు మీకు చాలా బ్యాడ్ నేమ్ వస్తోంది. మీరెందుకు చేస్తున్నారో తెలీదు ఇటువంటి వాళ్లను అరికట్టండి' అని తమ్మారెడ్డి కోరారు.

బాబూ ఆలోచించండి..

బాబూ ఆలోచించండి..

‘రాష్ట్రానికి కావల్సింది తీసుకురావడానికి మీతో పాటు మేమందరం ఉన్నాం. అంతే తప్ప ఇలా ఒకొక్కరినీ ట్రాలింగ్‌లు, బూతులు తిట్టడం, బద్మాష్‌లనడం.. అది కూడా ప్రభుత్వ రిప్రజెంటేటివ్స్ వీళ్లు. నాలాంటి వాళ్లెవరో మాట్లాడితే పర్వాలేదు. ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు వీళ్లు. అంటే చంద్రబాబు గారు మిమ్మల్ని రిప్రజెంట్ చేయడమే ఇక్కడ. అంటే మీరన్నట్టే అవుతుంది. మీరు ఆలోచించండి. ఇది మీ దాకా వస్తే సంతోషిస్తాను' అని తమ్మారెడ్డి భరద్వాజ తన అభిప్రయాన్ని వ్యక్తం చేశారు.

English summary
Tollywood Director and Producer Tammareddy Bharadwaj responded on TDP MLC Rajendra Prasad and Special Representative of AP Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X