రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే!: ఎస్ఐ, రైటర్‌ను నిర్బంధించి తీవ్ర అవమానం..

Subscribe to Oneindia Telugu

ఏలూరు: అధికారాన్ని అడ్డుపెట్టుకుని తణుకు టీడీపీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పోలీసులపై జులుం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన మాటను లెక్క చేయకుండా టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినందుకు ఎస్ఐ సహా రైటర్ ని తన కార్యాలయంలో నిర్బంధించినట్లు తెలుస్తోంది.

స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఈస్టర్ పండుగ రోజున ఇరగవరం మండలం రేలంగి శివారులోని అంతెనవారి పేటలో రెండు దళిత వర్గాల మధ్య మొదలైన వివాదం.. ఈ మొత్తం వ్యవహారానికి దారితీసింది.గొడవలో టీడీపీ, వైసీపీకి చెందిన వ్యక్తులు కల్పించుకోవడం.. ఇరు వర్గాలు దాడులకు దిగడంతో.. పోలీసులు వారిని అరెస్టు చేయాల్సి వచ్చింది.

వైసీపీ వ్యక్తుల ఇళ్లపై దాడి:

వైసీపీ వ్యక్తుల ఇళ్లపై దాడి:

ఈస్టర్ పండుగ రోజు సమాధులను అలికే విషయంలో రెండు దళిత వర్గాల మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. స్మశానంలో ఇరు వర్గాలు గొడవకు దిగాయి. అనంతరం ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోగా.. తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు వైసీపీకి చెందినవారి ఇళ్ల మీద దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఈ దాడిలో ఒక వ్యక్తి తల పగిలింది.

ఇరు వర్గాల వ్యక్తులు అరెస్ట్:

ఇరు వర్గాల వ్యక్తులు అరెస్ట్:

దాడిపై ఫిర్యాదు అందడంతో.. విచారణ చేపట్టిన పోలీసులు.. ఇరు వర్గాలకు చెందిన ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 307కింద వీరిపై కేసు నమోదు చేయగా.. కేసులో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ.. టీడీపీకి చెందినవారిపై కేసు పెట్టవద్దని ఎస్ఐపై ఒత్తిడి తెచ్చారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్లగా.. దాడి జరిగింది నిజమేనని నిర్దారించుకున్న తర్వాత కేసులు నమోదు చేశారు.

ఎస్ఐ, రైటర్ ను తన కార్యాలయానికి పిలిపించి:

ఎస్ఐ, రైటర్ ను తన కార్యాలయానికి పిలిపించి:

కేసులు నమోదు చేసిన తర్వాత.. టీడీపీ, వైసీపీలకు చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నాడు వైసీపీకి చెందిన మరొకరిని అరెస్టు చేశారు. తన మాట వినకుండా టీడీపీ వారిపై కేసులు పెట్టడంతో.. ఎమ్మెల్యే ఆరిమల్లి రాధాకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐని, రైటర్ ను తన కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశించారు.

ఎంత దమ్ము మీకు?:

ఎంత దమ్ము మీకు?:

ఎస్ఐ, రైటర్.. ఇద్దరు ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకోగానే.. వారిపై రాధాకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసు పెట్టడానికి మీకెంత దమ్ము? అంటూ ప్రశ్నించారు. కార్యాలయంలో నేలపై కూర్చోబెట్టి, సమాధానం చెప్పేవరకు కదలనిచ్చేది లేదన్నారు. ఈ తతంగం మొత్తాన్ని కొంతమంది పోలీసులు ఫోటోలు తీయగా.. వారి నుంచి సెల్ ఫోన్లు తీసుకుని, ఫోటోలను డిలీట్ చేయించారు.

నిర్బంధంపై ఎస్పీ ఫోన్:

నిర్బంధంపై ఎస్పీ ఫోన్:

ఎస్ఐ, రైటర్ లను ఎమ్మెల్యే నిర్బంధించారన్న సంగతి తెలియగానే.. అక్కడి ఎస్పీ ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు. నిర్బంధించడం సరికాదని ఎమ్మెల్యేకు చెప్పడంతో.. ఆపై వారిద్దరిని వదిలేసినట్లు సమాచారం. అయితే వారు బయటకు వెళ్తున్న సమయంలో.. తెలుగుదేశం కార్యకర్తలు మరోమారు వారిని అడ్డగించినట్లు సమాచారం. దీంతో పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారు. తమవారిపై అన్యాయంగా కేసులు పెట్టినందుకే వారిని పిలిపించానని, అంతే తప్ప ఎవరిని నిర్బంధించలేదని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వారితో తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tanuku Mla Arimilli Radhakrishna was behaved rudely with local SI for arresting Tdp members regarding a scuffle between two dalit groups
Please Wait while comments are loading...