తారకరత్న భార్య షాకింగ్ కామెంట్స్...భర్త చనిపోయిన కనికరించని నందమూరి కుటుంబం..?

నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి భర్త మరణాన్ని నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ హీరోగా,తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నందమూరి తారక రత్న తెలుగు ప్రజలందరికీ సుపరిచితులు.నందమూరి వారసుడిగా అందరి మన్ననలను చూరగొన్న నందమూరి తారకరత్న రాజకీయాల్లో రాణిస్తారు అనుకుంటే ఊహించని విధంగా ఆయన మృతి చెందారు. టీడీపీ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మొదటి రోజునే తారకరత్నకు గుండె పోటు వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా ఆయన కొద్ది రోజులకే మృతి చెందారు.

తారకరత్నంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఒంటరైయ్యారు. ఇక అలేఖ్య, నందమూరి తారకరత్న‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కులాలు వేరు కావడంతో అలేఖ్య రెడ్డి, తారకరత్నను నందమూరి కుటుంబం చేరదీయలేదు. దీంతో తారక్ తన భార్యతో వేరుగా ఉంటూ వచ్చాడు. చాలా సంవత్సరాలు తన కుటుంబానికి దూరంగా ఉన్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక బాబు కూడా జన్మించాడు.

taraka ratna wife alekhya reddy interesting comments on nandamuri family

తన కుటుంబంతో తారకరత్న అప్పుడప్పుడు మాట్లాడుతూ వస్తున్నారు. ఇక అంతా బాగుందనుకునేలోపే తారకరత్న హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. తారకరత్న చనిపోయిన తర్వాత కూడా ఆయన తల్లిదండ్రుల్లో ఎటువంటి మార్పు రాలేదని తెలుస్తోంది. అలేఖ్య సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్స్‌తో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ అభిమాని, ఇప్పటికైనా తారకర్న ఫ్యామిలీ, మిమ్మల్ని దగ్గరకు తీసుకున్నారా..? పిల్లల్ని పట్టించుకుంటున్నారా? కోడలిగా అంగీకరించారా..? అంటూ ప్రశ్నించాడు.

దానికి ఆమె సమాధానం ఇస్తూ..ఆశలు, నమ్మకాలే మనల్ని ముందుకు నడిపిస్తాయి. ఆ నమ్మకంతోనే తారక్, నేను ఇన్నేళ్లు మాజీవితాలను గడుపుతూ వచ్చాం.ఆయన ఎప్పుడూ తన నమ్మకాన్ని, ఆశను విడిచిపెట్టలేదు. నేను కూడా ఆయన బాటలోనే నడుస్తున్నాను. ఖచ్చితంగా అది జరిగే రోజు వస్తుందని భావిస్తున్నా. నా పిల్లలకు మంచి కుటుంబం ఉంటుందంటూ కామెంట్ చేసింది. దీంతో తారకరత్న తల్లిదండ్రులు ఇప్పటికీ అలేఖ్యను కనికరించలేదనే విషయం అందరికి అర్థం అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+