175 స్థానాలు మనవే : చంద్రబాబుకు ఓటు - పథకాలకు వ్యతిరేకం : మీ భవిష్యత్ నాది - సీఎం జగన్..!!
ప్లీనరీ వేదికగా సీఎం జగన్ తిరిగి తన గెలుపుపై ధీమా వ్యక్తం చేసారు. ఎన్ని కుట్రలు చేసినా..గెలుపు వైసీపీదేనని స్పష్టం చేసారు. చెప్పింది చేసాడనే నమ్మకం ఉంటేనే వచ్చే ఎన్నికల్లో ఓటేయండంటూ పిలుపునిచ్చారు. టీడీపీ పెత్తందారీ పార్టీ అని అభివర్ణించారు. దోచుకో - దాచుకో విధానంతో చంద్రబాబు పాలన సాగిందన్నారు. చంద్రబాబు తన పార్టీ సైకిల్ ను తొక్కలేక..కుమారుడితో తొక్కించలేక..దత్తపుత్రుడిని తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. గట్టిగా మొరిగినంత మాత్రాన గ్రామ సింహాలు..సింహాలు కావన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే ఆ ఓటు సంక్షేమ పథకాలకు వ్యతిరేకం అవుతాయి. ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాద్యత పథకాలు అందుకుంటున్న ప్రతీ కుటుంబానిదీనంటూ నిర్దేశించారు. ఎన్నికలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ పార్టీ మీది- జగన్ మీ వాడని గుర్తించండని సూచించారు.

బాధ్యత ఉన్న పార్టీగా వైసీపీ
పార్టీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వైసీపీ రాజకీయ ప్రస్థానం గురించి వివరించారు. 13 ఏళ్ల కాలంగా తన మీద చూపిస్తున్న అభిమానానికి సెల్యూట్ చేసారు. మూడేళ్ల పాలనలో విద్యా వైద్యం వ్యవసాయ విప్లవం చూపించామన్నారు. నిజాయితీ చిత్తశుద్ది ఉన్న పార్టీగా రాబోయే తరం పైన బాధ్యత ఉన్న పార్టీగా వైసీపీ నిలిచిందన్నారు. వైఎస్సార్ మరణం తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాల పరామర్శ వద్దంటూ కాంగ్రెస్ - టీడీపీ కలిసి కేసులు వేసాయన్నారు. ఓదార్పు యాత్ర మానుకుంటే కేసులు ఉండేవే కావని చెప్పారు. బెదిరింపులకు జగన్ లొంగే వ్యక్తి అయితే ..మీ జగన్ మీ సమక్షంలో మీ ముందు ఇలా ఉండే వాడే కాదని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఏం చెప్పామో అదే చేసామని వివరించారు. టీడీపీ గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎంపీలను..ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని..తాము మాత్రం టీడీపీని నిర్వీర్యం చేయాలనే దిక్కుమాలిన పనులు చేయలేదన్నారు.

టీడీపీది పెత్తందారి పార్టీ.. వెన్నుపోటు సిద్దాంతం
ఈ మూడేళ్లలో ఇచ్చిన మాట నిలబెట్టుకొని.. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర కోసం ఆరాట పడుతున్నామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు తన చేతి వేలికి కొత్తగా రింగ్ పెట్టారని..అందులో చిప్ ఉందని చెబుతున్నారని..అయితే, మోకాళ్లు..అరికాళ్లలోనూ కాదు చిప్ ఉండాల్సింది అంటూ ఎద్దేవా చేసారు. అధికార వ్యామోహం తప్ప.. ప్రజలకు మంచి చేయాలని లేదని దుయ్యబట్టారు. 14 ఏళ్లుగా సీఎంగా పని చేసిన వ్యక్తి..తన సొంత నియోజకవర్గం కుప్పంను రెవిన్యూ డివిజన్ గా మార్చమని మనకు అర్జీ ఇచ్చారని.. కుప్పం ప్రజల కోసం రెవిన్యూ డివిజన్ గా మార్చామని జగన్ చెప్పుకొచ్చారు. టీడీపీ ఒక పెత్తందారు పార్టీ..పెత్తందార్ల కోసం..వారితో నడుపుతున్న పార్టీగా అభివర్ణించారు. చంద్రబాబుది వెన్నుపోటు సిద్దాంతమని విమర్శించారు. పేదల పిల్లలకు ఇంగ్లీషు మీడియం కావాలని మేము..వాళ్ల పిల్లలకే ఇంగ్లీషు మీడియం కావాలనేది చంద్రబాబు ఆలోచనగా విమర్శించారు. పిల్లలను బడిలోకి పంపిస్తే ముందుగా చెప్పిన విధంగా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నగదు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

నవరత్నాల అమలుతో విప్లవం
9 పథకాలు విద్యా రంగంలోనే అమలు చేస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీ పరిధిని వెయ్యి నుంచి 2466 ఆస్పత్రులకు పెంచామన్నారు. టీడీపీ తమ మేనిఫెస్టోలో 650 హామీలు ఇచ్చి..పది శాతం కూడా అమలు చేయలేదు. మూడేళ్ల వైసీపీ పాలనలో ప్రతీ ఒక్కరి వద్దకు వెళ్లి.. మేనిఫెస్టోలో చెప్పిందేంటి.. చేసిందేటో వివరిస్తున్నామని చెప్పారు. వరుసగా రైతులు- మహిళలకు చేసిన మేలు గురించి వివరించారు. తమ ప్రభుత్వంలో అమలవుతున్న సామాజిక న్యాయం గురించి విశ్లేషించారు. మండలిలో వైసీపీకి 32 మంది సభ్యులు ఉంటే అందులో 18 మంది ఎస్సీ-ఎస్టీ-బీసీ- మైనార్టీలుఉన్నారని చెప్పారు. 8 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు బీసీలకు ఇచ్చామని గుర్తు చేసారు. మహిళలకు పదవుల్లో 50 శాతం కేటాయించామని వివరించారు. తన పథకాలు ఆపేసి..కొత్త పేర్లతో ఎలా చేస్తారో సెటైరికల్ గా చెప్పారు.

లక్షా 63 వేల కోట్లు పంపిణీ
లక్షా 63 వేల కోట్లు ఇప్పటి వరకు డీబీటీ కింద బదిలీ చేసినట్లు వెల్లడించారు.నాడు చంద్రబాబు చేయనిది..ఇప్పుడు జగన్ ఎలా చేయగలుగుతున్నారో ఆలోచించాలని సూచించారు. జగన్ కంటే చంద్రబాబు ఎక్కువగా అప్పులు చేశారని వివరించారు. మూడు ప్రాంతాలకు రాజధానులు చేస్తూ న్యాయం చేస్తామంటే బాబు అండ్ కో కొనుగోలు చేసిన భూముల రేట్ల కోసం అడ్డుకుంటున్నారు. ఏపీలో 13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసామని సీఎం జగన్ గుర్తు చేసారు. అందులో ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే..ఒక మంత్రి..బీసీ ఎమ్మెల్యే ఇంటిని తగలబెట్టించిన దుర్మార్గం చంద్రబాబు ..ఆయన దత్తపుత్రుడిదంటూ వ్యాఖ్యానించారు. 2019 లో ఓటు వేయని వారికి కూడా పార్టీ అర్హత ఆధారంగా అమలు చేసాము కాబట్టే..అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ ఫ్యాన్ గిర్రున తిరిగిందని...సైకిల్ చక్రాలు ఊడిపోయాయని ఎద్దేవా చేసారు. దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేలా ప్రతీ గ్రామంలో సోషల్ మీడియా సైన్యం సిద్దం చేయాలని జగన్ సూచించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications