CM Jagan సైలెంట్ ఆపరేషన్ : ఆ నేతలకు ఆఫర్లు..టార్గెట్ 2024 : వైసీపీ సీనియర్లలో టెన్షన్...!!
ముఖ్యమంత్రి జగన్ తాను అయిదేళ్ల ముఖ్యమంత్రిగా ఉండటానికి సిద్దంగా లేరు. రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకోవటానికి ఇప్పటికే నుండే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. 23 లోక్ సభ..151 అసెంబ్లీ సీట్లు దక్కించుకుంది. అందుకు అనేక అంశాలు దోహదం చేసాయి. అదే సమయంలో జగన్ ను చేసే ఓటర్లు వైసీపీని గెలిపించారని పార్టీ నేతలు చెబుతారు. ఆ సమయంలో చంద్రబాబు పైన వ్యతిరేకత...ఆయన పైన నమ్మకాన్ని పోగొట్టటంలో జగన్ సక్సెస్ అవటం కలిసి వచ్చాయి.

టీడీపీని ఆత్మరక్షణలోకి నెడుతూ..
ఇక, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయటంలో ...ఒక రకంగా ఆత్మరక్షణలో పడేయటంలోనూ జగన్ టీం పావులు కదుపుతూనే ఉంది. అదే సమయంలో మీడియా..న్యాయస్థానాల్లో కేసుల ద్వారా జగన్ పైన టీడీపీ యుద్దం చేస్తోంది. స్థానిక సంస్థల్లోనూ వైసీపీ ఏకపక్షంగా గెలుపు సాధించింది. అయితే,జగన్ చెప్పిన హామీలు అన్నీ నెరవేరుస్తున్నా..ప్రత్యేక హోదా అంశంలో మాత్రం ఖచ్చితంగా ఎన్నికల వేళ జగన్ సమాధానం చెపుకోవాల్సి ఉంటుంది. అందునా... అయిదేళ్ల తరువాత ఏ ప్రభుత్వం పైన అయినా వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుంది.

వైఎస్సార్ సన్నిహితులతో టచ్ లోకి..
దీంతో..పాటు పార్టీలో సీనియర్ల అవసరం ఉందని జగన్ భావిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఢిల్లీ స్థాయిలో పార్టీ ఇమేజ్ మరింత పెంచే నేతల వైపు జగన్ ఫోకస్ చేసారని తెలుస్తోంది. ఇందు కోసం జగన్ సైలెంట్ ఆపరేషన్ ప్రారంభించినట్లు సమాచారం. ఇందు కోసం గతంలో తన తండ్రికి సన్నిహితంగా ఉంటూ... ఇమేజ్ ఉన్న నేతలను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కోర్ టీంలోని ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

జగన్ కోసం వచ్చేదెవరు..
అందులో కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, కోట్ల సూర్యప్రకాశ రెడ్డి, సాయి ప్రతాప్, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, రఘువీరారెడ్డి వంటి వారినతో పాటుగా మరి కొందరిని తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు వైసీసీ లో జగన్ కోర్ టీం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తన తండ్రి వైఎస్సార్ తో సన్నిహితంగా మెలిగిన నేతలనే జగన్ ఎంచుకుంటున్నారని చెబుతున్నారు. అయితే, ఉండవల్లి మాత్రం తనకు ఇక క్రియాశీలక రాజకీయాలపైన ఆసక్తి లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. రఘువీరా సైతం పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

2024 ఎన్నికల్లో కీలక బాధ్యతలు
ఈ సీనియర్లు రావటం ద్వారా పార్టీకి అదనపు బలం అవుతుందనే అంచనా వేస్తున్నారు. 2019 లో ఉన్న వేవ్ కారణంగా ఎంపీ సీట్లు సునాయాసంగా గెలిచిన వైసీపీ... 2024 ఎన్నికల్లో ఎంపీ సీట్లు గెలవటం కోసం పక్కా వ్యూహాలు అమలు చేస్తేనే విజయం సాధ్యమనే భావనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా..తాము సింగిల్ గానే ఫైట్ చేయాలని వైసీపీ ఆలోచనతో ఉంది. దీంతో...ఈ సీనియర్లకు ఎంపీలుగా పోటీ చేసేందుకు అవకాశం..అదే విధంగా పార్టీ బాధ్యతలు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

పనితీరే తాజా నేతలకు కొలమానం..
పార్టీ ఎంపీలు..ఎమ్మెల్యేల పని తీరు పైన జగన్ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. అయితే, ఇప్పుడు పార్టీలో తామే సీనియర్లమని చెప్పుకుంటున్న వారికి సైతం ఈ నిర్ణయం చెక్ పెట్టనుంది. దీంతో..వ్యక్తులు కంటే పార్టీ ముఖ్యమని...అందుకోసం ఎటువంటి నిర్ణయాలకైనా సిద్దమనే సంకేతాలు దీని ద్వారా జగన్ ఇవ్వటం ప్రారంభించారు. ఇప్పుడు ఈ వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్ గా మారుతోంది.












Click it and Unblock the Notifications