Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుప్పం ఎమ్మెల్యే సీటే టార్గెట్- సీఎం జగన్ కొత్త స్కెచ్ : వైసీపీ అభ్యర్దిగా పెద్దిరెడ్డి వారసుడు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట పైన క్రమేణా పై చేయి సాధిస్తున్న వైసీపీ..ఇక, ఇప్పటి నుంచే ఎమ్మెల్యే సీటు పైన టార్గెట్ పెట్టింది. ఇక్కడ నుంచి చంద్రబాబు వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకు ముందు ఒక విడత చంద్రగిరి నుంచి గెలుపొందారు. వైసీపీ ఆవిర్భావం తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి బీసీ వర్గానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి పోటీ చేసారు. 2019 లోనూ ఆయనే బరిలో నిలిచారు. రెండు సార్లు ఓడిపోయారు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొంత కాలానికి చంద్రమౌళి అనారోగ్యంతో మరణించారు.

కుప్పంపై తొలి నుంచి సీఎం ఫోకస్

కుప్పంపై తొలి నుంచి సీఎం ఫోకస్

కుప్పం బాధ్యతలను ఆయన కుమారుడు భరత్ చూస్తున్నారు. అయితే, ఎలాగైనా చంద్రబాబు కంచుకోట కుప్పంను బద్దలు చేయాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. పంచాయితీ ఎన్నికల నుంచే సంస్థాగతంగా కుప్పంలో పట్టు సాధించే వ్యూహం అమలు చేసారు. అందులో భాగంగా చంద్రబాబు రాజకీయ ప్రత్యర్ధి..తన కేబినెట్ లో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఆయన పంచాయితీ ఎన్నికల్లోనూ.. జెడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికల్లోనూ చంద్రబాబు నియోజకవర్గంలో వైసీపీకి ఆధితప్యం దక్కేలా వ్యవహరించారు.

సర్పంచ్ నుంచి మున్సిపల్ దాకా

సర్పంచ్ నుంచి మున్సిపల్ దాకా


దీంతో..కుప్పం మున్సిపాల్టీ అయిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నిక పైన చంద్రబాబు వ్యక్తిగతంగా రంగంలోకి దిగారు. తన కుమారుడుతో పాటుగా పార్టీ సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు. ఈ ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నా...ఆయన ఇలాకాలో వైసీపీ హవానే కంటిన్యూ అయింది. కుప్పం మున్సిపాల్టీ పైన వైసీపీ జెండా ఎగిరింది. దీంతో..ఇక, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు. ఇందు కోసం ఇప్పటి నుంచే స్కెచ్ సిద్దం చేస్తున్నారు.

భరత్ కు ఎమ్మెల్సీ సైతం వ్యూహంలో భాగమే

భరత్ కు ఎమ్మెల్సీ సైతం వ్యూహంలో భాగమే

అక్కడ ప్రస్తుతం వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న భరత్ కు ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. ఇప్పుడు అక్కడ మొత్తం మంత్రి పెద్దిరెడ్డి అంతా తానై వ్యవహరిస్తుండటంతో అక్కడ నుంచి పెద్దిరెడ్డి వారసుడిని రంగంలోకి దింపేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిధున్ రెడ్డి ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ఉన్నారు. లోక్ సభలో పార్టీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరిస్తున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆర్దికంగా..ఆ తరువాత పార్టీ వరుసగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దిరెడ్డి కీలకంగా వ్యవహరించారు.

కుప్పం నుంచి పెద్దిరెడ్డి వారసుడు

కుప్పం నుంచి పెద్దిరెడ్డి వారసుడు


ఆయన సోదరుడి కుమారుడు సోమల మండల ఇన్ ఛార్జ్ గా ఉన్న పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కుప్పం వైసీపీ అభ్యర్ధిగా పోటీలో దింపనున్నారు. దీని పైన ఇప్పటికే అంగీకారం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. సుధీర్ రెడ్డి కుప్పం నియోజకవర్గంలో ఇప్పటికే వైసీపీ నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. యువజన నేతగా పార్టీ అభ్యర్ధులు స్థానిక సంస్థల్లో..ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో గెలుపులో మంత్రి పెద్దిరెడ్డికి సహకారం అందించారు. వచ్చే ఎన్నికల్లోగా మరింతగా కుప్పంలో యాక్టివ్ అయ్యేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు.

కుప్పం పైన సీఎం..పెద్దిరెడ్డి ఫోకస్

కుప్పం పైన సీఎం..పెద్దిరెడ్డి ఫోకస్

ఇదే సమయంలో పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానంటూ చంద్రబాబు కుప్పం ఎన్నికల ప్రచార సభలో సవాల్ చేసారు. ఇప్పుడు క్రమేణా కుప్పం నియోజకవర్గంలో గెలవాలంటే ముందుగా గ్రామ స్థాయి నుంచి వైసీపీ పట్టు సాధిస్తూ వస్తోంది. ఇప్పుడు కుప్పం పట్టణంలోనూ పట్టు నిలబెట్టుకుంది. దీంతో..వచ్చే ఎన్నిక ల్లో గెలుపు పైన ధీమాతో ఉంది. అయితే, స్థానిక సంస్థల ఫలితాలు.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పైన ఏ మేర ప్రభావం చూపిస్తాయనేది మరో చర్చ.

చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారు

చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారు

ఇక, కుప్పం లో మంచినీరు ఇవ్వటం కోసం తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రాజెక్టు పైన ముఖ్యమంత్రి జగన్ తాజాగా అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలోనూ ప్రస్తావించారు. చంద్రబాబును సొంత నియోజకవర్గంలో ఆత్మరక్షణలోకి నెడితే.. పార్టీ నేతల్లో సైతం చర్చ జరుగుతుందనేది వైసీపీ నేతల అంచనా. దీంతో..ఇప్పుడు కుప్పం టార్గెట్ గా ముఖ్యమంత్రి జగన్ పక్కా స్కెచ్ అమలు చేయబోతున్నారు. మరి..చంద్రబాబు కుప్పంలో బలపడేందుకు ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+