తల్లికి వందనం నిధుల జమ ముహూర్తం మార్పు,'కిట్లు' అప్పుడే - తాజా నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభం వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం నిధుల జమ పైన కసరత్తు మొదలు పెట్టింది. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతున్న వేళ ఈ నెలలోనే ఈ నిధుల విడుదల చేస్తారని తొలుత భావించారు. అయితే, ఇప్పుడు మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా విద్యార్ధులకు ఇచ్చే కిట్స్ పంపిణీ మరింత సమయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, పాఠశాలల మాత్రం యథావిధిగా 12వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి.
ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నగదును జూలైలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19వ తేదీన ఈ నిధులు విడుదల చేయాలని తొలుత భావించారు. మెగా పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసి.. అదే రోజు నిధులు జమకు ఆలోచన జరిగింది. అయితే, ఇప్పుడు జూలై మొదటి వారంలో తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. 2025లో పాఠశాలలు పునఃప్రారంభమైన జూన్ 12న పథకాన్ని అమలుచేశారు. ఈ ఏడాది వివిధ కారణాలతో వచ్చే నెల అమలుచేయాలని భావిస్తున్నారు. గతేడాది 67.27 లక్షల మందికి పథ కం వర్తించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 68 లక్షలుగా గుర్తించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. గతేడాది నిబంధనల ప్రకారమే ఈ సంవత్సరం కూడా పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ నిధులు వేర్వేరుగా అందుతాయి.

జూలై తొలి వారంలో విడుదల
కాగా, ఇందుకోసం సుమారుగా రూ.9వేల కోట్లు అవసరం కానున్నాయి. రభుత్వం ఏడాదికి 67 క్షల మందికిపైగా పథకాన్ని అమలు చేస్తోంది. జూలై తొలి వారంలో ఈ నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం తాజాగా కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇక.. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈనెల 12నే బడులు పునఃప్రారంభం కానున్నాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో వేసవి సెలవులు పొడిగిస్తారనే చర్చ జరిగింది. తెలంగాణలో బడుల పునఃప్రారంభ తేదీని ఈనెల 15కు మార్చారు. దీంతో రాష్ట్రంలోనూ 15కు మార్చాలని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. అయితే రుతుపవనాలు ఇప్పటికే రాయలసీమలోకి ప్రవేశించడంతో రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ఎప్పటిలాగే జూన్ 12నే బడులు తెరవాలని ప్రభు త్వం నిర్ణయించింది. తొలి రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించనున్నారు. అలాగే, స్టూడెంట్ కిట్‌లో కొన్ని వస్తువులు ఇస్తారు. యుద్ధం కారణంగా కిట్ల తయారీ ధరలు పెరిగిపోవడం వల్ల పంపిణీ కొంత ఆలస్యం అవుతుందని సమాచారం.













Click it and Unblock the Notifications