ఉద్యోగుల జీతాల చెల్లింపులో కీలక మార్పులు, ఇక నుంచి- తాజా ఉత్తర్వులు..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల జీతాల చెల్లింపు పైన స్పష్టమైన మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటో తేదీనే వేతనాలు అందించే విషయంలో ఏ మాత్రం రాజీపడకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వేతనాల చెల్లింపుల్లో ఏ మాత్రం జాప్యం చోటుచేసుకున్నా సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని ఆదేశిస్తూ ఏకంగా జీవో జారీ చేయటం కీలకంగా మారుతోంది.
తెలంగాణలో ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, ఇతర గౌరవ వేతన సిబ్బంది అందరికీ ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందించాల్సిందేనని తేల్చి చెప్పింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు అందించే విషయంలో ఏ మాత్రం రాజీపడకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వేతనాల చెల్లింపుల్లో ఏ మాత్రం జాప్యం చోటుచేసుకున్నా సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని ఆదేశిస్తూ ఈ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది. సకాలంలో వేతనాలు చెల్లించడంలో విఫలమయ్యే ఆయా శాఖల విభాగాధిపతులు(హెచ్‌ఓడీ), జీతాల పంపిణీ అధికారుల(డీడీ)పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది. వేతన, గౌరవ వేతన బిల్లుల ప్రాసెసింగ్‌లో ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఆ శాఖల ముఖ్య కార్యదర్శులు, హెచ్‌ఓడీలు సంబంధిత విషయాన్ని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి లేదా కార్యదర్శిని వ్యక్తిగతంగా కలిసి వివరించాలని ఆదేశించింది.

ఖచ్చితంగా అమలు చేయాలి.. మార్గదర్శకాలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని ప్రకటించింది. కొన్ని శాఖల్లో కూడా వివిధ కారణాల వల్ల వేతనాల చెల్లింపు ఆలస్యమవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆర్థిక శాఖ తెలిపింది. వేతన, గౌరవ వేతన బిల్లుల తయారీలో జాప్యం, వాటిని ట్రెజరీలు, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో సకాలంలో సమర్పించకపోవడం, ఉద్యోగుల హాజరు అంశంలో గందరగోళం, ప్రభుత్వం నిర్దేశించిన గడువును అనుసరించక పోవడం, బిల్లుల స్ర్కూటినీ, ఆడిటింగ్ తదితర కారణాల వల్ల వేతనాలను ఒకటో తేదీన చెల్లించడం లేదు. వేతనాల చెల్లింపుపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఈ విషయాలు తెలిసి ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ తదితర ఉద్యోగులందరికీ ఎలాంటి జాప్యం లేకుండా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే జీవో జారీ అయ్యింది. అన్ని ప్రభుత్వ శాఖలు, గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థలు, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలు కూడా ఒకటో తారీఖు నిబంధనను పాటించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు.













Click it and Unblock the Notifications