పవన్ కల్యాణ్ దెబ్బ, సినిమా చూపించిన టాస్క్ ఫోర్స్, పుష్పా సీన్ రిపీట్
ఆంధ్రప్రదేశ్ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పినట్లు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎర్రచందనం స్మగ్లర్లను ఏరివేస్తామని, ఇక ముందు ఎర్రచందనం జోలికి ఎవ్వరు వచ్చినా వదిలే ప్రసక్తలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్ల మీద సంబంధిత టాస్క్ ఫోర్సు అధికారులు పంజా విసురుతున్నారు.
తిరుపతి జిల్లాల్లో టాస్క్‌ఫోర్సు పోలీసులు కూంబింగ్ నిర్వహించి ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్సు అధికారుల ఆధ్వర్యంలో రెండు బృందాలుగా అన్నమయ్య జిల్లా బాలపల్లి, భాకారాపేట అటవీప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించారు. స్థానిక అటవీ శాఖ అధికారులతో కలిసి సిద్దలేరు నుంచి కూంబింగ్ చేపట్టారు. ఉదయం రాజంపేట డివిజన్ బాలపల్లి బీట్ పరిధిలో దాట్లు సమీపంలో కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకెళుతూ టాస్క్ ఫోర్సు సిబ్బందికి కనిపించారు.

ఎర్రచందనం తరలిస్తున్న వాళ్లను చుట్టుముట్టే ప్రయత్నం చేయగా ఎర్రచందనం దుంగలను వదలేసిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. టాస్క్ ఫోర్స్ సబ్బంది ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు కళ్లకురిచి జిల్లాకు చెందిన చంద్రశేఖర్, శంకర్, వెంగటేశన్, ఎంజీఆర్, లక్ష్మణ్, సెల్వరసు అనే నిందితులను టాస్క్ ఫోర్సు సిబ్బంది అరెస్టు చేశారు. సంఘటనా స్థలం నుంచి 25 ఎర్రచందనం దుంగలను స్వాఽధీనం చేసుకున్నారు.
చంద్రగిరివైపు అటవీప్రాంతంలో మరో టీమ్ కూంబింగ్ చేపట్టింది. కల్యాణిడ్యాం నుంచి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను తనిఖీ చేశారు. భాకరాపేట సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద కొందరు వ్యక్తులు కారులో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూ అధికారులకు కనిపించారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా కారును స్మగ్లర్లు వేగంగా నడుపుతూ పారిపోయారు. బైక్‌లపై వెంటాడిన సిబ్బంది చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద నిందితులను అడ్డుకున్నారు.
కారులో పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని అదే కారులో ఉన్న ఏడు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రైల్వే బ్రిడ్జి కింద వారు వదలి వెళ్లిన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు తిరువణ్ణామలై జిల్లాకు చెందిన రవి, రంజిత్‌ను అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. తిరుపతి టాస్క్‌ఫోర్సు పోలీ్‌సస్టేషన్ లో కేసులు నమోదు అయ్యింది. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని శేషాచలం అడవుల్లో నిత్యం కూబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
-
తిరుమల ప్లాన్ చేసుకుంటున్న వారికి రైల్వే బిగ్ అప్డేట్, కొత్తగా అందుబాటులలోకి..!! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications