టీడీపీ - లీడర్స్ మేకింగ్ స్కూల్ : చంద్రబాబుపైనే భారం - కీలక అడుగులు..!?

తెలుగు దేశం. తెలుగు గడ్డ పైనే కాదు. జాతీయ రాజకీయాల్లోనూ ఒక సంచలనం. నేడు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. 41 ఏళ్ల తెలుగుదేశం.. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ శత జయంతి నిర్వహిస్తోంది. ఇదే రోజున ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు ద్వారా కొత్త రాజకీయ అధ్యాయానికి నాంది పలికారు.రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1983 జనవరి 8న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం 202 స్థానాలు గెలుచుకొని జయపతాక ఎగురవేసింది. తెలుగుదేశం దెబ్బకు 35సంవత్సరాల నుంచి రాజకీయాల్లో పాతుకుపోయి ఉన్న ఉద్ధండులు మట్టి కరిచారు.

ఎందరో నేతలకు పుట్టిల్లు టీడీపీ
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటుగా జాతీయ స్థాయిలో అనేక పదవులు నిర్వహించిన వారు టీడీపీ రాజకీయ పాఠశాలలోనూ ఓనమాలు దిద్దారు. ఎన్‌టీఆర్‌ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. కాంగ్రెస్ ఇతర 7 పార్టీలతో 1988లో ఒక ఫ్రంట్‌ను ఎన్‌టీఆర్‌ ఏర్పాటు చేశారు. చేసి 1989లో కాంగ్రెస్‌ను అధికారంనుంచి దించి నేషనల్‌ ఫ్రంట్‌ను ఢల్లీి గద్దెపై కూర్చోబెట్టారు. 1991 మే వరకు కొనసాగిన కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పనిచేసింది.

తరువాత 1996లో చంద్రబాబు కేంద్రంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా కొనసాగారు. దేవగౌడను ప్రధాని కావటంలో కీలక పాత్ర పోషించారు. తరువాత గుజ్రాల్ ప్రధాని అయ్యారు.1998 ఎన్నికల వరకు ఐ.కె.గుజ్రాల్‌ ప్రభుత్వంలో తెలుగుదేశం కేంద్రంలో కొనసాగింది. తరువాత 1999లో తెలుగుదేశం మద్దతుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిరది. అప్పుడు తెలుగుదేశం ఎంపీ బాలయోగి పార్లమెంట్‌ స్పీకర్‌గా వ్యవహరించారు. 2004 పార్లమెంట్‌ ఎన్నికల వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలుగుదేశం మధ్య పొత్తు కొనసాగింది.

TDP 41st Anniversary: A school which had made leaders,All credits to Chandrababu-How will it flare

తెలుగు రాజకీయాల్లో సంచలనంగా
నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటుతో 1984 నవంబర్‌ 22న ఎన్‌టీఆర్‌ శాసనసభను రద్దు చేశారు. తరువాత 1985 మార్చి 5న శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరుగగా తెలుగుదేశం 202 స్థానాల్లో గెలుపొంది ఎన్‌టీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం అధికారం కోల్పోయింది. మళ్లీ 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం 220 సీట్లలో గెలుపొంది అఖండ విజయం సాధించింది. ఎన్‌టీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

1995, ఆగస్టులో తెలుగుదేశంలో ఏర్పడిన తిరుగుబాటు కారణంగా చంద్రబాబు సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 180 స్థానాలలో తెలుగుదేశం గెలుపొందటంతో సెప్టెంబర్‌ 5వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణస్వీకారం చేశారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం 47సీట్లలో2009 ఎన్నికల్లో 92 సీట్లలోనే గెలుపొందటంతో వరుసగా రెండోసారి చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చున్నారు.

చంద్రబాబు సమర్ధతకు పరీక్షగా
ఎన్‌టీఆర్‌ 7 సంవత్సరాల 7 నెలలు ముఖ్యమంత్రిగా కొనసాగారు, 5 సంవత్సరాలపాటు ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా దాదాపు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. 13 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో బీజేపీ - జనసేనతో కలిసి టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో మరోసారి టీడీపీ ఓడిపోయింది.

ఘనంగా ప్రారంభమైన టీడీపీ రాజకీయ ప్రస్థానం..నేడు పూర్వ వైభవం దిశగా అడుగులు పడుతున్నాయి. నేడు ఆవిర్భావ దినోత్సవం నాడు రెండు రాష్ట్రాలకు చెందిన పార్టీ ప్రతినిధులతో చంద్రబాబు కీలక సమావేశం ఏర్పాటు చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు టీడీపీ భవిష్యత్ కు కీలకంగా మారుతున్నాయి. ఏపీలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+