బాబుకు షాక్: ఆనం బ్రదర్స్ వద్దేవద్దంటూ టిడిపి ఆఫీస్‌కు మెయిల్స్, ఫ్యాక్స్
నెల్లూరు: ఆనం సోదరుల (ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి) చేరిక పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు షాక్ తగులుతోంది. ఆనం సోదరులను పార్టీలో చేర్చుకోవద్దంటూ చాలామంది పార్టీ కార్యాలయానికి మెయిళ్లు, ఫ్యాక్స్ సందేశాలు పంపిస్తున్నారు.
ఆనం సోదరులను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకోవద్దని కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి మెయిల్స్ చేస్తున్నారు. వారిని పార్టీలో చేర్చుకుంటే లాభం కంటే నష్టం ఎక్కువ అని వారు అందులో పేర్కొన్నారు. వీరి చేరిక ద్వారా ప్రశాంతంగా ఉన్న నెల్లూరు జిల్లా పార్టీలో ఇబ్బందులు ఏర్పడతాయని చెబుతున్నారు.

'జూన్‌కల్లా అంతా విజయవాడకు రావాలి'
వచ్చే ఏడాది జూన్ కల్లా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం విజయవాడకు రావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు శనివారం స్పష్టం చేశారు.
నిన్న సచివాలయంలో మంత్రులు, అన్నిశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్‌ఓడీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఆయన ప్రభుత్వ యంత్రాంగం తరలింపు గురించి ప్రస్తావించారు.
ఇకమీదట ఇలాంటి సమావేశాలు కూడా విజయవాడలోనే ఉంటాయన్నారు. తప్పనిసరి అయిన ఒకటి రెండు శాఖలు మినహాయించి మిగతా యంత్రాంగమంతా వచ్చే జూన్ నుంచి విజయవాడ నుంచి విధులు నిర్వర్తించాలన్నారు. వచ్చే ఏప్రిల్, మేనాటికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications