కూటమిలో మరో కుంపటి..వీధికెక్కి మరీ తనుకున్న నేతలు

టీడీపీలో అసంతృప్తి జ్వాలలు చల్లారలేదు.టికెట్ల చిచ్చు ఆ పార్టీలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తు వల్ల టీడీపీలో చాలామంది సీనియర్ నాయకులకు టికెట్ల దక్కని పరిస్థితి. దీంతో టికెట్ దక్కని నేతలు చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీలో వర్గపోరు కూడా తారస్థాయికి చేరుకుంది.నేతల మధ్య అధిపత్య పోరు కూడా టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే టికెట్ దక్కని నేతలు చాలామంది టీడీపీకి రాజీనామా చేశారు. కొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.

కూటమికి షాకిస్తూ 16 చోట్ల రెబల్ అభ్యర్థులు బరిలో నిలవడం హాట్ టాపిక్ అవుతోంది. 175 నియోజకవర్గాల్లో 16 చోట్ల రెబల్స్ నుంచి పోటీ అంటే సాధారణమైన విషయం కాదు.ఈ నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులు గెలుస్తారో లేదో చెప్పలేం కానీ టీడీపీ, ఇతర పార్టీలను మాత్రం రెబల్ అభ్యర్థులు సులువుగానే ఓడిస్తారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. రెబల్స్‌ సంగతి ఇలా ఉంటే మరో పక్క ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో నేతల మధ్య అధిపత్యపోరు ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీకి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.

TDP Activists Fight in Dhone Constituency at Nandyal

నంద్యాల జిల్లా డోన్ నియోజకర్గంలో నేతల అధిపత్యపోరు తారస్థాయికి చేరింది. ధర్మవరం సుబ్బారెడ్డి డోన్ టికెట్ ఆశించి భంగపడ్డారు. చంద్రబాబు గతంలో ఇక్కడ పర్యటించిన సమయంలో ధర్మవరం సుబ్బారెడ్డికే టీడీపీ టికెట్ అని ప్రకటించారు. అయితే ఎన్నికల సమయంలో డోన్ నియోజకవర్గ టికెట్‌ను కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డికి కేటాయించారు. ఈ నిర్ణయంపై ధర్మవరం సుబ్బారెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు బుజ్జగించడంతో మెత్తబడిన ధర్మవరం సుబ్బారెడ్డి.. టీడీపీ గెలుపుకు కృషి చేస్తానని ప్రకటించారు.

కానీ నియోజకవర్గంలో మాత్రం నువ్వా..నేనా? అనే రీతిలో నేతల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. ఏకంగా రాళ్లతో దాడి చేసుకునే వరకు వెళ్లింది వ్యవహారం. రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు కట్టెలతో రాళ్లతో దాడి చేసుకున్నారు. ఎంత సముదాయించినా ఎవరూ వినకపోవడంతో దీన్ని తట్టుకోలేక కోట్ల సూర్య ప్రకాష్‌ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే ఆపేశారు.నియోజకవర్గంలో పరిస్థితులు దారుణంగా మారడంతో టీడీపీ అధిష్టానం సైతం చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+