జగన్ షెడ్యూల్ రిలీజ్ వెనుక ? బెయిల్ రద్దుకు-బుద్ధా కామెంట్స్..!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు హాజరైన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై టీడీపీ మండిపడింది. ముఖ్యంగా జగన్ మందీ మార్బలంతో కోర్టుకు వెళ్లడం, ముందుగానే షెడ్యూల్ రిలీజ్ చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనిపై కోర్టులో పిటిషన్ వేస్తామని, జగన్ బెయిల్ రద్దు కోరతామని టీడీపీ నేత బుద్ధా వెంకన్న తెలిపారు.

లక్షల కోట్లు దోచుకుని 11 ఈడీ కేసులున్న జగన్ ముద్దాయిగా కోర్టుకు హాజరు కావడంలో తప్పేముందని బుద్దా ప్రశ్నించారు.
అయితే ఆయనే కోర్టుకు సమయమిచ్చేలా షెడ్యూల్ విడుదల చేయడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. 11.30 లోపలకు వెళతాడు.. 12.30 బయటకు వస్తామని జగన్ షెడ్యూల్ ఇచ్చాడన్నారు. అంటే న్యాయమూర్తి చెప్పినట్లు జగన్ వింటాడా.. జగనే ముందు నిర్ణయం తీసుకుంటాడా అని ప్రశ్నించారు. ఈ విచిత్రం ఎక్కడైనా ఉందా.. న్యాయవ్యవస్థను కూడా డిక్టేట్ చేస్తున్నాననే భయబ్రాంతులు కల్గించేందుకు జగన్ ఉద్దేశం అని బుద్దా తెలిపారు.

TDP Alleges YS Jagan s Court Schedule Release Intends to Pressure Judges

కోర్టుకు వాయిదా వెళితే న్యాయమూర్తి పిలిచే వరకు సాయంత్రం అయినా వేచి ఉండాలని, కానీ జగన్ మాత్రం ముందే షెడ్యూల్ ఇచ్చారంటే అర్దం కోర్టును అవమానించారనే కదా అని బుద్దా తెలిపారు. కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్లే వ్యక్తి హడావుడి చేయడం ఏమిటన్నారు. మందీ మార్భలంతో హంగామా చేస్తే మళ్లీ వాయిదాకు హాజరు కాకుండా ఉండవచ్చని జగన్ ప్లానా ఇది అని నిలదీశారు. సీఎంగా ఉన్నప్పుడు భయబ్రాంతులు కల్గించిన జగన్.. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా జనాలను భయ పెట్టాలని చూస్తున్నాడన్నారు.

కోర్టులు కూడా వెంటనే జగన్ బెయిల్ ను రద్దు చేసి జైలుకు పంపాలన్నారు. జగన్ కు దేవుడి పై నమ్మకం ఉంటే.. కోర్టుకు విచారణకు హాజరుకావాలన్నారు. మన వ్యవస్థలపై నమ్మకం ఉంటే చేసిన తప్పులకు జైలుకు వెళ్లాలన్నారు. అక్రమంగా దోచుకుని కూడా మళ్లీ కార్యకర్తలను అడ్డం పెట్టుకుని హడావుడి చేస్తున్నారన్నారు. అంటే కోర్టులను, పోలీసులను కూడా లెక్కచేయకుండా జగన్ వ్యవహరిస్తున్నాడన్నారు. తమ న్యాయవాదులతో మాట్లాడి అతని బెయిల్ రద్దు చేయాలని పిటీషన్ వేస్తానన్నారు. జగన్ లాంటి అవినీతి పరుడు బయట ఉండకూడదన్నారు. కోర్టుకు ఒక్కడే వెళ్లాల్సి ఉన్నా.. దారి పొడవునా కార్యకర్తలను రెచ్చగొట్టేలా రూట్ మ్యాప్ ఇచ్చాడన్నారు.

జగన్ పద్దతిలో రప్పా రప్పా అని ప్రజలను భయ పెట్టిన విధంగా కోర్టులను కూడా భయపెట్టాలని చూస్తున్నారన్నారు.
జగన్ కోసం స్వచ్చందంగా జనాలు వచ్చే రోజులు ఎప్పుడో పోయాయన్నారు. ముందే నాయకులతో మాట్లాడుకుని... రోడ్లు మీదకు రావాలని కార్యకర్తలను బతిమాలుకుంటున్నారన్నారు. ఇంతా ప్లాన్ ప్రకారం రెచ్చగొట్టేలా మొబలైజ్ చేసుకుని జనాలను రోడ్ల మీదకు తీసుకువస్తున్నారన్నారు.

TDP Alleges YS Jagan s Court Schedule Release Intends to Pressure Judges

కేటీఆర్, జగన్ ఇద్దరూ సమానమేనని, వాటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు.ప్రజాధనాన్ని కొట్టేసి కూడా 12 యేళ్లుగా బెయిల్ పై ఉండటం అనేది చాలా దుర్మార్గం అన్నారు.ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని కోర్టును ఆశ్రయిస్తామన్నారు. జగన్ కోర్టుకు వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ప్రకటన వెనుక కూడా కుట్ర ఉందన్నారు. ప్లాన్ ప్రకారం అల్లర్లు, హడావుడి చేసి.. జగన్ కోర్టుకు రావద్దని కోర్టుతోనే చెప్పేలా చేస్తున్నాడన్నారు.డబ్బులు ఇచ్చి కిరాయి మనుషులను పెట్టుకున్నప్పుడు.. జగన్ ఏం చెబితే అదే వారు చేస్తారన్నారు. జగన్ ను వెంటనే విచారణకు పిలిపించి.. బెయిల్ రద్దు చేసేలా చూడాలన్నారు. ఈ విషయంలో న్యాయ నిపుణులు కూడా ఆలోచన చేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+