ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్లలోనూ కూటమి ప్రభంజనం- తాజా అప్డేట్ ఇదే..!
ఏపీలో తాజాగా నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ ఉదయం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 365 కౌంటింగ్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్లతో మొదలైంది. ఈసారి కూడా అధికార టీడీపీ కూటమి (TDP) ఫలితాల్లో దూసుకుపోతోంది. అయితే ఈసారి మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే ఎన్నో రెట్లు మెరుగ్గా ఆధిక్యంలో నిలుస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండు చోట్లా ఇదే జోరు కనిపిస్తోంది. కూటమికి పోటీ నివ్వడంలో ఈసారి వైఎస్సార్సీపీ మరింత వెనుకబడింది.
తాజాగా అందిన సమాచారం మేరకు 9829 ఎంపీటీసీ స్ధానాలకు జరుగుతున్న కౌంటింగ్ లో దాదాపు 2 వేలకు పైగా స్ధానాల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత కూటమి ఏకంగా 1900 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైసీపీ కేవలం 89 సీట్లలో ఆధిక్యం కనబరుస్తోంది. ఇతరులు మరో 31 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు జడ్పీటీసీల్లో మొత్తం 659 స్ధానాలు ఉండగా..ఇందులో 82 స్ధానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి కాగా ఇందులో కూటమి పార్టీలు 79 గెల్చుకోవడంతో పాటు 2 చోట్ల ఆధిక్యంలో నిలిచారు. వైసీపీ ఒక చోట ఆధిక్యంలో ఉంది. దీంతో ఆరంభ ట్రెండ్ కూటమికి భారీ ఆధిక్యాల్ని కట్టబెడుతోంది.

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ముందే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ కూటమి ప్రభంజనం కొనసాగింది. అయితే మున్సిపల్ ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్లలో మాత్రం కూటమితో పోలిస్తే వైఎస్సార్సీపీ పోటాపోటీగా ఓట్లు తెచ్చుకుంది. కానీ గ్రామ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో మాత్రం వైఎస్సార్సీపీ ఆ జోరు కొనసాగించలేకపోతున్నట్లు తాజా ట్రెండ్ ను బట్టి అర్దమవుతోంది. అంటే పట్టణ స్ధానిక సంస్ధలతో పోలిస్తే గ్రామ స్దానిక సంస్ధల్లో ఉద్యోగులు కూటమివైపు ఏకపక్షంగా మొగ్గినట్లు తెలుస్తోంది. అయితే మున్సిపల్ ఎన్నికలైనా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలైనా మెజార్టీ ఉద్యోగులు మాత్రం అధికార కూటమివైపే నిలిచారని ఫలితాలు వెల్లడిస్తున్నాయి.













Click it and Unblock the Notifications
