బీజేపీ తరఫున పోటీచేసేది చంద్రబాబు మనుషులే?
ఏపీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీతో పొత్తును ఖరారు చేసేందుకు రెండు రోజుల నుంచి తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీలో ఉన్నారు. సీట్ల పంపకాలపై ఒక స్పష్టత వస్తే ఎవరెవరు? ఎక్కడెక్కడ నుంచి పోటీచేయనున్నారనే విషయంలో కూడా ఒక స్పష్టత వస్తుంది. ప్రస్తుతం బీజేపీ 10 అసెంబ్లీ, 7 లోక్ సభ సీట్లు అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం 6 అసెంబ్లీ, 4 లోక్ సభ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందంటున్నారు. జనసేన, బీజేపీకి కలిపి 30 స్థానాలకు మించి అసెంబ్లీ సీట్లు ఇవ్వకూడదని, అలా ఇస్తే వైసీపీకే ప్రయోజనం కలుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.

భారతీయ జనతాపార్టీకి సీట్లు కేటాయించినప్పటికీ దానివెనక చంద్రబాబు వ్యూహాలు వేరుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోక్ సభ నియోజకవర్గాలకు బీజేపీ తరఫున పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ కు సీట్లు దక్కడం ఖాయం. పురంధేశ్వరి మినహా మిగతావారంతా చంద్రబాబు మనుషులే. జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డిలాంటివారిని తెలుగుదేశం పార్టీ శ్రేణులే పనిగట్టుకొని ఓడిస్తాయంటున్నారు.
అసెంబ్లీకి సంబంధించి జమ్మలమడుగు ఆదినారాయణరెడ్డి, విష్ణుకుమార్ రాజు, కామినేని శ్రీనివాస్, వరదాపురం సూరి లాంటివారున్నారు. వీరంతా ఒకప్పటికీ టీడీపీ నాయకులే. ఆదికి జమ్మలమడుగు, సూరికి ధర్మవరం, కామినేనికి కైకలూరు, విష్ణుకుమార్ రాజుకు విశాఖ నార్త్ సీట్లు ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. సోము వీర్రాజు, మాధవ్ లాంటివారిని టీడీపీ శ్రేణులే ఓడిస్తాయనే ప్రచారం నడుస్తోంది.
పేరుకు బీజీపీతో పొత్తు ఉంటుందికానీ అందులో పోటీచేసేవారంతా చంద్రబాబు మనుషులే ఉంటారని, అందులోనే అసలు కిటుకు ఉందని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ తరఫున పోటీచేసే అభ్యర్థుల్లో 90 శాతం మంది టీడీపీ నాయకులే ఉంటారు. వారికే టికెట్ ఇస్తారని, అందుకు బీజేపీ నాయకులను చంద్రబాబు ఒప్పిస్తారంటున్నారు.












Click it and Unblock the Notifications