భూమా కు చంద్రబాబు మార్క్ షాక్ - అభ్యర్దుల ఫిక్స్, వారి దారెటు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. పార్టీలు అభ్యర్దుల ఖరారు పైన ఫోకస్ చేసాయి. టీడీపీ, జనసేన పొత్తుతో క్షేత్ర స్థాయిలో సమీకరణాలు మారుతున్నాయి. కీలకమైన కర్నూలు జిల్లాలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో ఉత్కంఠ పెంచుతున్నాయి. కీలకమైన నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఇప్పుడు కొత్త లెక్కలు మొదలయ్యాయి. తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో పరిణామాలు మారే అవకాశం కనిపిస్తోంది.
నంద్యాల లో ఫరూక్:కర్నూలు జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వచ్చే ఎన్నికల్లోనూ అదే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఈ సమయంలోనే టీడీపీ అలర్ట్ అయింది. జనసేనతో పొత్తు తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. టీడీపీ నుంచి సీటు రాదని భావిస్తున్న నేతలు జనసేన నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజులుగా సాగుతున్న నంద్యాల పంచాయితీకి టీడీపీ అధినాయకత్వం ముగింపు ఇచ్చింది. నంద్యాల ఇంఛార్జ్ గా ప్రస్తుతం ఉన్న మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి స్థానంలో మాజీ మంత్రి ఫరూక్ ను ఖరారు చేసింది. వచ్చే ఎన్నికల్లో ఫరూక్ నంద్యాల నుంచి టీడీపీ అభ్యర్దిగా బరిలో ఉండటం ఖాయమైంది. ఈ నిర్ణయంతో భూమా బ్రహ్మానందరెడ్డి వర్గం ఆగ్రహంతో ఉంది. పార్టీ సీటు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్దిగా అయినా పోటీలో ఉందామంటూ చెబుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఆళ్లగడ్డలోనూ కొత్త లెక్కలు:2017 ఉప ఎన్నికల్లో.. భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరఫున విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ ఆయనకే టికెట్ కేటాయించినా.. ఓడిపోయారు. ప్రస్తుతం భూమా బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కొనసాగుతున్నారు. పార్టీలో మైనారిటీ వర్గాల ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించి ఫరూక్ కు సీటు కేటాయించారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన వహీద్‌కు.. కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఇటు టీడీపీ - జనసేన పొత్తు ఖయమైన నేపథ్యంలో తాజాగా ఇరిగెల రాంపుల్లారెడ్డి పవన్ సమక్షంలో జనసేనలో చేరారు.ఇరిగెల రాంపుల్లారెడ్డి వర్గం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంది. 1997లో ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో గంగుల కుటుంబం పోటీకి దూరంగా ఉండటంతో ఇరిగెల రాంపుల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కుటుంబానికి మద్దతు ప్రకటించారు. భూమా నాగిరెడ్డి 2008లో టీడీపీని వీడి ప్రజారాజ్యంలో చేరినప్పుడు ఆ స్థానంలో రాంపుల్లారెడ్డిని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు.
ఆసక్తికర రాజకీయం:చంద్రబాబు సమక్షంలో 2009లో టీడీపీలో చేరి అసెంబ్లీకి పోటీ చేశారు. 2012 ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరడంతో ఇరిగెల సోదరులు పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు జనసేనలో చేరే సమయంలోనే టికెట్ పైన హామీ పొందారని ప్రచారం సాగుతోంది. టీడీపీ నుంచి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ తనకు సీటు ఖాయమనే ధీమాతో ఉన్నారు. అయితే, నియోజకవర్గంలో కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు..వరుస కేసులు...వివాదాలతో భూమా అఖిల ప్రియకు సీటు ఇస్తారా లేదా ..ఇచ్చినా పార్టీ కేడర్ సహకరిస్తుందా అనే చర్చ మొదలైంది. దీంతో, అఖిలకు టీడీపీ నుంచి సీటు రాకుంటే పవన్ తో ఉన్న పరిచయంతో ఆ పార్టీ నుంచి సీటు దక్కించుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు జనసేనలోకి రాంపుల్లారెడ్డి చేరటంతో అఖిల సీటు పైన సస్పెన్స్ కొనసాగుతోంది. అటు నంద్యాల సీటు భూమాకు లేదని తేలిపోయింది. ఇటు ఆళ్లగడ్డ విషయంలోనూ భూమా ఫ్యామిలీకి సీటు విషయం పై సందిగ్ధత కొనసాగుతోంది. దీంతో, ఇప్పుడు భూమా ఫ్యామిలీ రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారుతోంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications