బిజెపి, టిడిపి పొత్తు: టి బిజెపి ఆఫీసులో గందరగోళం

TDP, BJP alliance: Tension occurres in T BJP Office
హైదరాబాద్: నగరంలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బిజెపిలు కలిసి పోటీ చేసేందుకు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బిజెపి కార్యకర్తలు శనివారం ఇక్కడ ఆందోళన చేపట్టారు. టిడిపితో పొత్తు పెట్టుకుంటే.. బిజెపికి బలమైన అభ్యర్థులున్న స్థానాలను ఆ పార్టీ నాయకులకే కేటాయించాలని డిమాండ్ చేశారు.

పొత్తులతో సంబంధం లేకుండా సూర్యాపేట టిక్కెట్‌ను సంకినేని వెంకటేశ్వరావుకి ఇవ్వాలంటూ నల్గొండ జిల్లా సూర్యపేటకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్ నుంచి రతన్‌ బాలరెడ్డికి చెందిన కార్యకర్తలు కూడా కార్యాలయంలో నినాదాలు చేశారు.

రతన్‌ బాలరెడ్డికి టికెట్ రాకుండా బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు.
పార్టీ కోసం పనిచేసిన వారికే నారాయణపేట్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన నాగం జనార్ధన్ రెడ్డిని కార్యకర్తలు నిలదీశారు. తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలని కోరారు.

ఇరువర్గాల మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు పొత్తులతో సంబంధం లేకుండా నామినేషన్లు వేయాలని మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా, టిడిపి అధినేత చంద్రబాబుతో బిజెపి జాతీయ నాయకుడు ప్రకాశ్ జవదేకర్ పొత్తులపై చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+