టిలో 45-8, సీమాంధ్రలో 15-5: బిజెపి-టిడిపికి కుదిరినా

దీనిపై ఇరు పార్టీల నేతలు చర్చోపచర్చలు జరిపారు. అనంతరం రెండు ప్రాంతాల్లో పార్టీల మధ్య పొత్తు పొడిచినట్లుగా తెలుస్తోంది. సీట్ల పైన ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లుగా సమాచారం. అయితే, ఇంకా ఏ ఏ నియోజకవర్గాలు ఎవరికి అనే విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది.
భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రాంతంలో 45 అసెంబ్లీ, 8 లోకసభ స్థానాలను, సీమాంధ్రలో 15 అసెంబ్లీ, 5 లోకసభ స్థానాలను ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. దానికి బిజెపి కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని సమాచారం.
పలు నియోజకవర్గాల కోసం ఇరు పార్టీలు పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్, మహేశ్వరం స్థానాలను బిజెపికి ఇవ్వవద్దని టిడిపి నేతలు పార్టీ అధిష్టానానికి మొర పెట్టుకున్నారు. కాగా, సీమాంధ్రలో నర్సాపురం, కాకినాడ, రాజంపేట, తిరుపతిలతో పాటు మరో లోకసభ స్థానాన్ని బిజెపికి ఇచ్చేందుకు టిడిపి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications