ఇప్పుడు అవసరమా?: జగన్‌కు దేవినేని, గవర్నర్ పైనా
హైదరాబాద్: వర్షాలు పడి రాష్ట్రంలో రైతులు కన్నీరు పెడుతుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి శంఖారావాలు కావాల్సి వచ్చిందా అని టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు గురువారం అన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టిడిపి నేతలు సచివాలయ సమతా బ్లాకు వద్ద బైఠాయించారు. విభజన లెక్కలు తర్వాత చూద్దామని మొదట బాధితులను పట్టించుకోవాలని నినాదాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమామహేశ్వర రావు తదితరులు మాట్లాడారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలుగు జాతిని చీల్చాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే సోనియా రాష్ట్రపతి వద్దకు వెళ్లి రాష్ట్రాన్ని ఎలా చీల్చాలా అని చర్చలు జరుపుతున్నారని, జగన్ శంఖారావం జరుపుతున్నారని మండిపడ్డారు. రైతులు ఏడుస్తుంటే ఇవన్నీ అవసరమా అన్నారు. విభజనకు సహకరించే వారుకు సోనియా బిస్కట్లు వేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ నరసింహన్‌ను తరిమికొట్టే రోజు వస్తుందన్నారు.

డిగ్గీతో గవర్నర్ భేటీపై యనమల
రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌పై టిడిపి శాసన సభా పక్ష నేత యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన అంశంపై ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌కు వివరణ ఇవ్వడం గవర్నర్ విధుల్లో భాగమా? అని ప్రశ్నించారు. అధికారిక రిపోర్టులతో కాంగ్రెసు నేతల ఇళ్లకు గవర్నర్ ఎలా వెళ్తారన్నారు.
తెలుగు జాతిపై గవర్నర్ ద్వేషం ప్రదర్శిస్తున్నారా చెప్పాలన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో జగన్ జుట్టు ఉందని, ఆయన నిర్వహించేది సమైక్య శంఖారావం కాదని, కేసుల నుంచి బయటపడే శంఖారావం అని యనమల ఎద్దేవా చేశారు. కేసు విచారణ, శిక్షపడితే అనర్హత వేటును చూపి జగన్‌ను సోనియా తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications