టీడీపీ ఎమ్మెల్యే పై దాడి - సొంత పార్టీ నేతలే..!!

గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కు సొంత పార్టీ టీడీపీ నేతల నుంచే నిరసన వ్యక్తమైంది. దాడికి దిగారు. ఈ ఘటన సంచలనంగా మారింది. తమకు సమాచారం లేకుండా అక్కడకు వెళ్లిన ఎమ్మెల్యేపై ఓవర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇరువర్గాలు బాహాబాహికి తలపడ్డాయి. ఎమ్మెల్యే పై దాడికి ప్రయత్నించారు. దీంతో, పోలీసులు అక్కడ పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకొచ్చారు.

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పై దాడి ఘటన అధికార పార్టీలో కలకలం రేపింది. గుంటూరు నగర పరిధిలోని ఒకటో డివిజన్ లో స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షుడిగా సయ్యద్ ఇంతియాజ్ ఉన్నారు. ఆయన సోదరుడు ఫైరోజ్ గత ఎన్నికల్లో ఈ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన నగర టీడీపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. తమకు తెలియకుండా ఎమ్మెల్యే ప్రయివేటు కార్యక్రమానికి హాజరు కావటం పైన ఇంతియాజ్, ఫైరోజ్ సోదరులతో పాటుగా ఆయన సమీప బంధువు రియాజ్ వేదిక పైన ఉండగానే నజీర్ అహ్మద్ ను నిలదీసారు.

TDP cadre seriously reacts against own party MLA Nazeer Ahmed in Guntur leads to new controversy

ఎమ్మెల్యే వారిని హెచ్చరించారు. ఇంతలో ఫైరోజ్, ఇంతియాజ్ ఎమ్మెల్యే పై దాడికి ప్రయత్నం చేసారు. చొక్కా పట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఎమ్మెల్యే కు రక్షణగా నిలిచారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు అయినట్లు చెబుతున్నారు. ఈ సంఘటనతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. నియోజకవర్గం లో టీడీపీలో ఉన్న వర్గ విభేదాలు దాడుల వరకు వెళ్లటం పైన పార్టీలో చర్చ మొదలైంది. ఈ ఘటన పైన పార్టీ నాయకత్వం ఆరా తీసినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+