పంతం నెగ్గించుకున్న పురందేశ్వరి - బీజేపీ అభ్యర్దిగా టీడీపీ నేత..!!

ఏపీలో ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీ, బీజేపీ సీట్ల సర్దుబాటు కొనసాగుతోంది. టీడీపీ లో తాజాగా పోటీలో నిలిచిన అయిదుగురు అభ్యర్దులను మార్చారు. మరో రెండు స్థానాల్లో నిర్ణయం పెండింగ్ లో ఉంచారు. ఇదే సమయంలో అనపర్తి సీట్లు విషయంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఆ సీటు బీజేపీకి ఇవ్వటంతో కొంత కాలంగా హైడ్రామా కొనసాగుతోంది. చివరకు బీజేపీ అక్కడ పంతం నెగ్గించుకుంది.

బీజేపీలోకి నల్లమిల్లి
అనపర్తి సీటు వివాదం పైన టీడీపీ, బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చాయి. పొత్తులో భాగంగా అనపర్తి సీటు బీజేపీకి కేటాయించారు. అప్పటికే అక్కడ టీడీపీ అభ్యర్దిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించారు. తన సీటు బీజేపీకి ఇవ్వటంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్గం ఆందోళనకు దిగింది. ఆ సీటు పురందేశ్వరి పోటీ చేస్తున్న రాజమండ్రి పరిధిలో ఉండటంతో పురందేశ్వరి ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. బీజేపీ అనపర్తి వదులుంటే ఆ పార్టీకి తంబళ్లపల్లె సీటు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దమయ్యారు. కానీ, బీజేపీ నుంచి దెందులూరు సీటు పైన ప్రతిపాదన వచ్చింది.

TDP Candidate NAlammili to contest from BJP for Anaparthy Seat As Purandeswari suggest

బీజేపీ అభ్యర్దిగా పోటీ
బీజేపీ అధినాయకత్వం సీటు మార్పు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఆ వెంటనే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నల్లమిల్లి ఇంటికి పంపారు. మరోవైపు బుచ్చయ్యతో నారా లోకేష్ కూడా మాట్లాడారు. దీంతో బుచ్చయ్య చౌదరి, బీజేపీ నేతలు కలిసి రామకృష్ణా రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనతో మాట్లాడారు. బీజేపీ నుంచి పోటీ చేయాలని సూచించారు. ఇలా చంద్రబాబు, బుచ్చయ్య చౌదరి, బీజేపీ నేతలు మాట్లాడటంతో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంగీకరించారు.దీంతో.. నల్లమిల్లి ఇవాళో, రేపో బీజేపీలో చేరనున్నారు. అనంతరం బీజేపీ బీఫామ్ తీసుకుని నామినేషన్ దాఖలు చేయనున్నారు.

TDP Candidate NAlammili to contest from BJP for Anaparthy Seat As Purandeswari suggest

పురందేశ్వరి స్కెచ్
దీంతో...బీజేపీ అభ్యర్దిగా నల్లమిల్లి అనపర్తి నుంచి పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. వైసీపీ అభ్యర్ది ఇప్పటికే అక్కడ ప్రచారం కొనసాగిస్తున్నారు. టీడీపీ గుర్తు పైన నల్లమిల్లి ఇప్పటికే ఒక విడత ప్రచారం పూర్తి చేసారు. ఇప్పుడు నల్లమిల్లి తిరిగి తాను కమలం గుర్తు పైన పోటీ చేస్తున్న అంశం పైన ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. రాజమండ్రి ఎంపీ అభ్యర్దిగా పోటీలో ఉన్న పురందేశ్వరి వ్యూహం మేరకే ఈ నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. తనకు కలిసి వచ్చేలా పురందేశ్వరి నేరుగా చంద్రబాబుతో చర్చలు జరిపి ఈ నిర్ణయం అమలుకు ప్లాన్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో..ఇప్పుడు టీడీపీ నేత బీజేపీ గుర్తు పైన పోటీ చేస్తుండటంతో ఫలితం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+