విక్టరీ బాబు: కార్యకర్తలతో లోకేష్, సంబరాలు(పిక్చర్స్)
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో(సీమాంధ్ర) ఘన విజయం సాధించడంతోపాటు తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ హోదాలో కొనసాగేంత స్థానాలు దక్కించుకుంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన అభివృద్ధి నినాదాన్ని సీమాంధ్ర ప్రజలు స్వీకరించారు. దీంతో టిడిపి-బిజెపి కూటమికి 106 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించారు.
ఎన్నికల ఫలితాల వెలువడిన అనంతరం సీమాంధ్ర, తెలంగాణలోని టిడిపి కార్యకర్తలు టపాసులు కాలుస్తూ.. నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్, చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర కార్యకర్తలతో కోలాహలంగా మారింది. డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేశారు. పసుపు రంగు చల్లుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు కార్యకర్తలు.
చంద్రబాబు నాయుడు ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో తన నివాసంలో కేక్ కట్ చేశారు. ఆయనకు పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు. వారి నమ్మకాన్ని నిలబెడతామని చెప్పారు. సీమాంధ్రను స్వర్ణాంధ్రగా చేస్తామని చెప్పారు. సామాజిక తెలంగాణకు సహకరిస్తామని తెలిపారు.

చంద్రబాబు నాయుడు
చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు. వారి నమ్మకాన్ని నిలబెడతామని చెప్పారు. సీమాంధ్రను స్వర్ణాంధ్రగా చేస్తామని చెప్పారు. సామాజిక తెలంగాణకు సహకరిస్తామని తెలిపారు.

కృష్ణయ్య విజయనాదం
ఎల్‌బి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఆర్ కృష్ణయ్య సంబరాలు జరుపుకుంటున్న దృశ్యం.

కార్యకర్తల ఉత్సాహం
సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో(సీమాంధ్ర) ఘన విజయం సాధించడంతోపాటు తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ హోదాలో కొనసాగేంత స్థానాలు దక్కించుకుంది.

విక్టరీ సింబల్ చూపిస్తూ..
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన అభివృద్ధి నినాదాన్ని ప్రజలు స్వీకరించారు. దీంతో టిడిపి-బిజెపి కూటమికి 106 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించారు.

కేక్ కట్ చేస్తూ...
చంద్రబాబు నాయుడు ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో తన నివాసంలో కేక్ కట్ చేశారు.

చంద్రబాబుకు అభినందనలు
సీమాంధ్రలో టిడిపి ఘన విజయం సాధించిన అనంతరం చంద్రబాబును పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

నృత్యాలు చేస్తున్న కార్యకర్తలు
ఎన్నికల ఫలితాల వెలువడిన అనంతరం సీమాంధ్ర, తెలంగాణలోని టిడిపి కార్యకర్తలు టపాసులు కాలుస్తూ.. నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.

కార్యకర్తలతో లోకేష్
డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేశారు. పసుపు రంగు చల్లుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు కార్యకర్తలు.

కార్యకర్తలతో కోలాహలం
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్, చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర కార్యకర్తలతో కోలాహలంగా మారింది.












Click it and Unblock the Notifications