ఏపీలో ఫలితాల వేళ ఈ-ఆఫీస్ మూసివేత? వద్దంటూ గవర్నర్ కు బాబు లేఖ..!
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓట్ల లెక్కింపు, ఫలితాలకు మరో మూడు వారాల సమయం ఉంది. ఇలాంటి సమయంలో వైసీపీ ఆపద్ధర్మ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో వాటిని అడ్డుకునేందుకు విపక్షాలు గవర్నర్ ను ఆశ్రయించాల్సిన పరిస్ధితి. ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గవర్నర్ సాయంతో అడ్డుకున్న విపక్షాలు.. ఇప్పుడు ఈ-ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ డేషన్ కోసం చేస్తున్న ప్రయత్నాలను సైతం అడ్డుకోవాలని ఆయన్ను కోరాయి.
ఈ నెల 17నుంచి 25 వరకు అప్ గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ -ఆఫీస్ అప్ గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలని గవర్నర్ కు రాసిన లేఖలో కోరారు. ఇంత హడావిడిగా ఈ-ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ డేషన్ కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ ఆఫీస్ అప్ గ్రేడియేషన్ అవసరం లేదని తెలిపారు.

పారదర్శకత పాటించని ఈ ప్రభుత్వంలో ఈ-ఆఫీస్ వ్యవహారంలో అక్రమాలు జరిగే అవకాశం ఉందని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం షెడ్యూల్ చేసిన ఈ-ఆఫీస్ వెర్షన్ అప్ గ్రేడ్ వల్ల సీఎంవో, చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ విభాగాల సేవలకు సంబంధించి ఈ ఆఫీస్ ఈ నెల 17 నుండి 25 వరకు అందుబాటులో ఉండడం లేదని, అత్యవసరంగా ఇప్పుడు చేపట్టిన ఈ ప్రక్రియపై అధికారులు, రాజకీయ పార్టీల్లో అనుమానాలు ఉన్నాయన్నారు.
గత 5 ఏళ్లలో ప్రభుత్వం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించిన జీవోలను కూడా ప్రభుత్వం వెబ్ సైట్ లో పెట్టడకుండా రహస్యంగా ఉంచుతోందని, అడ్డగోలుగా విడుదల చేసిన జీవోలను, ప్రభుత్వ పారదర్శకతను ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం దాడి చేసిందని లేఖలో చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ఈ సమయంలో ఈ-ఆఫీస్ వెర్షన్ మార్పు కోసం నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఈ ఆఫీస్ మూసివేత, అప్ గ్రేడ్ ప్రక్రియను కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టేదాకా నిలిపివేయాలని సీఎస్ ను ఆదేశించాలని కోరారు.
ఇప్పటికే పలు కీలకమైన రికార్డులు మాయమైనట్లు తెలిసిందని చంద్రబాబు గవర్నర్ కు తెలిపారు. కొద్దిరోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా పలు రికార్డులను సీఐడీ కూడా అనుమతి లేకుండా కాల్చేసిందన్నారు. ప్రభుత్వ రికార్డుల మాయం, కాల్చివేతపై సీఈఓకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఫైల్‌లు, నోట్ ఫైల్‌లు, రికార్డ్‌లు మాయంకాకుండా భద్రపరచాలన్నారు. అలాగే అన్ని హెచ్ఓడీలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే సీసీ కెమెరాలు ఉన్న చోట పరిశీలన జరపాలన్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications