చంద్రబాబు ఉగ్రరూపం - నన్ను జైళ్లో వేయండి..!!

టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులు అడ్డుకోవటం పైన చంద్రబాబు ఉగ్రరూపం ప్రదర్శించారు. తనను అడ్డుకుంటారా అంటూ పోలీసులను నిలదీసారు. రోడ్డు షోలకు అనుమతి లేదంటూ నోటీసులు ఇచ్చి తనను సంతకాలు చేయమనటం పైన సీరియస్ అయ్యారు. పోలీసులు చాలా తెలివిగలవాళ్లు అంటూ ఫైర్ అయ్యారు. తనను తన ప్రజలకు మధ్య దూరం పెంచుదామని చూస్తున్నారా అంటూ సీరియస్ అయ్యారు. ఎంత మందిని జైళ్లో పెడతారో పెట్టండి..తనను కూడా జైళ్లో పెట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారో రాసివ్వాలని డిమాండ్ చేసారు.

తన నియోజకవర్గంలో ఎందుకు తాను ఎందుకు రాకూడదో స్పష్టంగా ఇవ్వాలని చంద్రబాబు కోరారు. తనకు మైక్ ఎందుకు ఇవ్వరని నిలదీసారు. ఎన్ని రకాలుగా తనను ఇబ్బంది పెట్టినా పారిపోనని చెప్పుకొచ్చారు. తనను అప్రతిష్ఠ పాలు చేద్దామని అనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు. తన ప్రజల కోసం మాట్లాడుతున్నానని.. ఎందుకు నిరాకరిస్తున్నారంటూ ఆన్సర్ చేయాలంటూ ఆవేశంతో ప్రశ్నించారు. తన పోరాటం పోలీసుల పై కాదని, వారిని నడిపిస్తున్న ప్రభుత్వం పైనే అనే అని స్పష్టం చేసారు. తాను డీజీపీకి సమాచారం ఇచ్చినా..అడ్డుకోవటం ఏంటని ప్రశ్నించారు. తన ప్రచార రధం ఎందుకు తీసుకున్నారని నిలదీసారు. పోలీసులు సూచించిన ప్రాంతంలోనే రోడ్ షో చేస్తానని..ముందుగా స్వాధీనం చేసుకున్న వాహన్ ఇవ్వాలని డిమాండ్ చేసారు.

TDP Chief Chandra Babu Angry over police officials on Rejects permission for meeting at Kuppam

తాను చట్టబద్దంగా నడుచుకొనే వ్యక్తినని చంద్రబాబు స్పస్టం చేసారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో లో లోపాలు ఉన్నాయని చంద్రబాబు వివరించారు. వైసీపీకి ఒక రూలు, తమకు ఒక రూలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులు మనసు చంపుకొని పని చేస్తున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తన ప్రజలతో తాను మాట్లాడకూడదా అంటూ సీరియస్ అయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోకు చట్టబద్దత లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నియంతగా పాలన చేయాలని అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. అందరినీ బెదిరించి పాలన చేస్తున్నారని ఆరోపించారు. బ్రిటిష్ వారి కంటే దారుణంగా జగన్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+