ఎన్టీఆర్ శాశ్వతంగా గుర్తుండిపోయేలా - చంద్రబాబు తాజా నిర్ణయం..!!

టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్య నిర్ణయం ప్రకటించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు..మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఎన్టీఆర్ శాశ్వతంగా గుర్తుండిపోయేలా ఆయన పేరుమీద స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.

తెలుగు జాతి గర్వకారణంగా స్టాచ్యూ ఆఫ్ తెలుగు ప్రైడ్ గా దాన్ని నెలకొల్పుతామని ప్రముఖుల సమక్షంలో ప్రకటన చేసారు. ఎన్టీఆర్ కు భారతరత్న కోసం కేంద్రంపైన ఒత్తిడి తెస్తామని..పోరాడుతూనే ఉంటామని చంద్రబాబు పేర్కొన్నారు.

TDP Chief chandra Babu Announces NTR Memorial will Establish As Statue of Telugu pride

స్టాచ్యూ ఆఫ్ తెలుగు ప్రైడ్ గా: విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా చంద్రబాబు తనకు ఎన్టీఆర్ తో కొనసాగిన అనుబంధం గురించి వివరించారు. రాజకీయాల్లో క్రమశిక్షణ..సమయపాలన ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు. తెల్లవారు జామున 5 గంటలకు తాను వెళ్లకపోతే ఫోన్ వచ్చేదని, 4.55 వెళ్లి అందుబాటులో ఉండేవాడినన్నారు.

అసాధ్యం అనేది ఆయన చరిత్రలో లేదన్నారు. రెండు రూపాయాలకే కిలో బియ్యం, ఆడపిల్లలకు ఆస్తి హక్కు లాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి సాధ్యం కాదని కొందరు వనెక్కి లాగే ప్రయత్నం చేసారని గుర్తు చేసారు. ఆయన నిర్బయంగా నిర్ణయాలు తీసుకొని కొత్త చరిత్ర లిఖించారని కొనియాడారు. తాను న్యాయం అని నమ్మింది చేసి చూపించేవారని చంద్రబాబు ప్రశంసించారు.

మహానాడులో కార్యాచరణ: ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాల్లో భాగంగా ఇప్పటికి హైదరాబాద్, నిమ్మకూరు, విజయవాడల్లో మూడు సభలు నిర్వహించామని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ స్పూర్తితోనే పి4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ కార్యక్రమాన్ని ప్రకటించామని చెప్పుకొచ్చారు. దీనిని ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. పేదలు ఎప్పటిక ీపేదలుగానే మిగలకుండా వారిని ధనవంతులుగా చేసే కార్యక్రమంగా చంద్రబాబు వివరించారు.

స్టాచ్యూ ఆఫ్ తెలుగు ప్రైడ్ గా ఎన్టీఆర్ పేరు మీద స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వచ్చే నెలలో జరిగే మహానాడులో ఈ నిర్ణయం అమలు దిశగా కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ అధికారం కోసం రాజకీయాల్లో రాలేదని, దేశ రాజకీయాలను మలుపు తిప్పాలని వచ్చారని చంద్రబాబు వివరించారు.

రజనీ ఆప్త మిత్రుడు: ఎన్టీఆర్ నుంచి ఎలా స్పూర్తి పొందారో, తనను ఎంతగా ప్రభావితం చేసారో సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు. ఎన్టీఆర్ తో రజనీకాంత్ కు ఉన్న అనుభవాలను విన్న తరువాత ఒక నాయకుడు మరో నాయకుడిని ఎలా ప్రభావితం చేస్తారో తెలిసిందన్నారు. రజనీకాంత్ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పే మనిషని చంద్రబాబు పేర్కొన్నారు.

రజనీ తనకు ఆప్త మిత్రుడని చెప్పిన చంద్రబాబు, ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ఆహ్వానిస్తే షూటింగ్ రద్దు చేసుకొని వచ్చారని వివరించారు. అది రజనీకాంత్ కు ఎన్టీఆర్ పైన ఉన్న గౌరవం, స్నేహానికి ఇచ్చే విలువగా చంద్రబాబు పేర్కొన్నారు. రజనీకాంత్ గొప్ప మానవతా వాదిగా చంద్రబాబు ప్రశంసించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+