గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కీలక నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్ధులను ఖరారు చేసిన చంద్రబాబు..!!

|
Google Oneindia TeluguNews

Chandra Babu: రానున్న ఎన్నికల దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. ముందస్తు వ్యూహాలతో కేడర్ ను సిద్దం చేస్తున్నారు. జిల్లాల పర్యటనలు వేగవంతం చేసారు. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాల పైన ఫైర్ అవుతున్నారు. ఈ మూడున్నారేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ అధికారం లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను చంద్రబాబు వేగవంతం చేసారు. ఇప్పటికే నియోజకవర్గాల సమీక్షలో అభ్యర్ధులను ఖరారు చేస్తున్న చంద్రబాబు.. తాజాగా మరో ఇద్దరి అభ్యర్దిత్వానికి ఆమోదం తెలిపారు.

పొత్తులు - అభ్యర్ధుల ఎంపిక

పొత్తులు - అభ్యర్ధుల ఎంపిక


రానున్న ఎన్నికలు టీడీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు లక్ష్యం. ఇందుకోసం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవటానికి సిద్దంగా లేరు. పొత్తుల దిశగా ప్రయత్నాలు చేస్తూనే.. పొత్తులపైనే ఆధారపడ్డామే అభిప్రాయం రాకుండా చూసుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా తన జిల్లాల పర్యటనలో వైసీపీని లక్ష్యంగా చేసుకుంటున్నారు. చంద్రబాబు సభ లకు జనసమీకరణ ను సైతం పార్టీ నేతలు సవాల్ గా తీసుకుంటున్నారు. ఇక, ఇప్పటికే దాదాపు 130 నియోజకవర్గాలకు సంబంధించి చంద్రబాబు సమీక్షలు పూర్తి చేసారు. 50 శాతం సీట్లు యువతకు ఇస్తామని చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించారు. ఇక, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసారు. పొత్తుల అంశం పైన స్పష్టత వచ్చిన తరువాత సీట్ల కేటాయింపు విషయంలో తుది ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఇక, ఇప్పుడు తాజాగా మరో రెండు నియోజకవర్గాలకు చంద్రబాబు పార్టీ అభ్యర్ధులను ఖరారు చేసారు.

ధూళిపాళ్ల నరేంద్రకు గుర్తింపు దక్కేనా

ధూళిపాళ్ల నరేంద్రకు గుర్తింపు దక్కేనా


టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లాలో రెండు రోజులు పర్యటించారు. అందులో భాగంగా టీడీపీ కంచుకోటగా ఉన్న పొన్నూరులో చంద్రబాబు సభకు భారీ స్పందన వచ్చింది. పొన్నూరులో 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఓడిపోయారు. వైసీపీ నుంచి పోటీ చేసిన సీనియర్ ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు అల్లడు కిలారి రోశయ్య వైసీపీ అభ్యర్ధిగా పొన్నూరు నుంచి గెలుపొందారు. టీడీపీ లో నరేంద్ర తండ్రి వీరయ్య చౌదరి మంత్రిగా పని చేసారు. ఆయన మరణం తరువాత నరేంద్ర పొన్నూరు నుంచి వరుసగా అయిదు సార్లు నరేంద్ర ఎమ్మెల్యేగా గెలిచి..2019లో ఓడిపోయారు. పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో 2014లో గుంటూరు జిల్లా నుంచి నరేంద్రకు చంద్రబాబు మంత్రివర్గం లో అవకాశం దక్కుతుందని అంచనా వేసారు. కానీ, నరేంద్రకు మంత్రి పదవి రాకపోవటం పైన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సంగం డెయిరీ వ్యవహారాల్లో నరేంద్రను అరెస్ట్ చేసారు. ఇక, ఇప్పుడు తిరిగి వచ్చే ఎన్నికల్లో నరేంద్ర అభ్యర్ధిత్వం ఖారారైంది. ఈ సారి పార్టీ అధికారంలోకి వస్తే నరేంద్రకు గుర్తింపు ఇవ్వాలని నియోజకవర్గ నేతలు-కార్యకర్తలు పార్టీ అధినేత చంద్రబాబును కోరారు.

బాపట్ల నుంచి టీడీపీ అభ్యర్ధి ఫిక్స్..

బాపట్ల నుంచి టీడీపీ అభ్యర్ధి ఫిక్స్..


గుంటూరు జిల్లా బాపట్ల ఇప్పుడు వైసీపీ - టీడీపీకి కీలకంగా మారింది. ఇక్కడ ప్రస్తుతం వైసీపీ నుంచి సీఎం జగన్ సన్నిహితుడు మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో రఘుపతి వరుసగా బాపట్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడ టీడీపీ నుంచి 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన అన్నం సతీష్ ప్రభాకర్ బీజేపీలో చేరారు. దీంతో, ఇప్పుడు అక్కడ వేగేశ్న నరేంద్ర వర్మను వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా చంద్రబాబు ఖరారు చేసారు. 1999లో టీడీపీ నుంచి మంతెన అనంతవర్మ రాజు గెలుపొందారు. తిరిగి బాపట్లలో ఇప్పటి వరకు టీడీపీ అభ్యర్ధి గెలవలేదు. ఇప్పటికే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న వేగేశ్న నరేంద్ర వర్మను వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా ఖరారు చేసారు. వైసీపీ అభ్యర్ధిగా తిరిగి కోన రఘుపతి పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలకమైన ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్ధుల విషయంలో చంద్రబాబు తన నిర్ణయం స్పష్టం చేసారు. పొత్తుల కారణంగా చివరి నిమిషంలో ఏదైనా అనూహ్య మార్పులు జరిగితే మినహా.. బాపట్ల ఎమ్మెల్యేగా వర్మ పోటీ ఖాయంగా కనిపిస్తోంది.

English summary
TDP Chief Chandra Babu almost finalise the PArty candidates for Ponnu and Batla assembly segments in his Guntur dist tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X