టార్గెట్ రోజా: చంద్రబాబు అసలు వ్యూహం ఇదే: అనితకు కీలక బాధ్యతల వెనుక..!
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయారు. దీంతో ఖాళీగా ఉన్న ఈ స్థానంలో దళిత వర్గానికి చెందిన అనితను నియమిస్తూ చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత నియమాకం వెనుక టీడీపీ అసలు లక్ష్యం వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా అనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని జగన్ నిర్ణయం తీసుకోవటం..దీనికి వ్యతిరేకంగా అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ టీడీపీ నిర్ణయించటంతో..ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన అనితకు కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో 2014-2019 కాలంలో టీడీపీ ఎమ్మెల్యేగా అనిత అటు అసెంబ్లీలో..ఇటు బయటా వైసీపీని టార్గెట్ చేయటంలో ముందు నిలచారు. ఇక, ఇప్పుడు చంద్రబాబు అప్పగించిన బాధ్యతల వెనుక భారీ వ్యూహం ఉన్నట్లుగా కనిపిస్తోంది.
అసలు లక్ష్యం రోజా..
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా లక్ష్యంగా అనితకు కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. విశాఖ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వటంతో పాటుగా..2014 నుండి రోజా పైన అనిత టీడీపీ అస్త్రంగా మారారు. శాసనసభలోనూ రోజా టీడీపీ పైన విమర్శలు చేసిన సమయంలో అనిత స్పందించేవారు. ఇక, చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేసారనే కారణంగా రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసారు. అదే సమయంలో నాటి మంత్రి పీతల సుజాత..అనిత పైన అనుచితంగా వ్యవహరించారనే కారణంతో రోజా నాడు ఎథిక్స్ కమిటీ విచారణ ఎదుర్కొన్నారు.

ఇక, ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీఐఐసీ ఛర్ పర్సన్ గా రోజా టీడీపీ అధినేత చంద్రబాబు..లోకేశ్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రతీ సందర్భంలోనూ చంద్రబాబు పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మూడు రాజధానుల వ్యవహారం..అమరావతి అంశం.. కొద్ది రోజుల క్రితం దిశ చట్టం పైన అసెంబ్లీలో చర్చ సమయంలోనూ రోజా కీలక వ్యాఖ్యలు చేసారు.
విశాఖ ప్రాంతం నుండి..
ఇక, టీడీపీలో మహిళల నుండి బలమైన వాయిస్ వినిపించే యామినీ పార్టీని వీడి బీజేపీలో చేరారు. దివ్యవాణి పార్టీ కార్యక్రమాల్లో అంత యాక్టివ్ గా ఉండటం లేదు. ఇక, పంచుమర్తి అనురాధా మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నారు. ఇదే సమయంలో విశాఖ రాజకీయాలు..అదే ప్రాంతానికి చెందిన దళిత వర్గానికి చెందిన అనిత నియమకం ద్వారా ప్రయోజనం ఉంటుందని చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో..తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.విశాఖ జిల్లాలో తాజా ఎన్నికల్లో టీడీపీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. వారు టీడీపీలోనే కొనసాగుతున్నా.. విశాఖకు పరిపాలనా రాజధానిని ఆహ్వానిస్తున్నారు. దీంతో..పార్టీ వాయిస్ కు అనుకూలంగా వ్యవహరించే అనితకు విశాఖ నుండి రాష్ట్రస్థాయి నాయకత్వం వహించే బాధ్యతలు అప్పగించటం ద్వారా.. తమ లక్ష్యానికి మేలు జరుగుతుందనే అంచనా టీడీపీ ముఖ్య నేతల్లో కనిపిస్తోంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications