రాప్తాడు "సిద్దం" సభ వేళ జగన్ కు చంద్రబాబు సవాల్..!!

ఏపీలో ఎన్నికల వేళ హోరా హోరీ రాజకీయం కొనసాగుతోంది. రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్ సిద్దం సభకు హాజరవుతున్నారు. ఈ సభ ద్వారా ఎన్నికల హామీలను ప్రకటిస్తారని భావిస్తున్నారు. భారీగా జన సమీకరణకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. రాయలసీమలో ఈ సభ ద్వారా సత్తా చాటాలని వైసీపీ నేతల వ్యూహం. ఇదే సమయంలో రాప్తాడు సభకు హాజరవుతున్న ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రశ్నలు సంధించారు.

అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ సిద్దం సభకు సర్వం సమాయత్తం అయింది. సీఎం జగన్ ఈ సభ ద్వారా కేడర్ కు ఎన్నికల దిశా నిర్దేశం చేయనున్నారు. భీమిలి, ఏలూరు సభలకు మించి రాప్తాడు సభ నిర్వహణకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేసారు. ఈ సభను రాయలసీమ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ సభలోనే సీఎం జగన్ ఎన్నికల హామీలను ప్రకటిస్తారని చెబుతున్నారు. టీడీపీ, జనసేనతో ఇప్పుడు బీజేపీ కలవటం ఖాయమని భావిస్తున్నారు. దీంతో, ప్రతిపక్షాలు ఉమ్మడిగా వచ్చినా తాను సింగిల్ గానే పోటీ చేస్తానని జగన్ ప్రకటించారు. 58 నెలల కాలంగా తాను అమలు చేసిన సంక్షేమం, సామాజిక న్యాయం తనను గెలిపిస్తాయనే ధీమాతో జగన్ ఉన్నారు.

TDP Chief Chandra Babu Questioned CM Jagan over Seema issues ahead Raptadu meeting

సీఎం జగన్ రాప్తాడు సభకు హాజరవుతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రశ్నలు సంధించారు. ట్విట్టర్ వేదికగా తన మూడు ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. రాప్తాడు అడుగుతోంది.... జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని? ..అంటూ ప్రశ్నించారు. అనంత అడుగుతోంది కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని? ..అని చంద్రబాబు నిలదీసారు. సీమ రైతన్న అడుగుతున్నాడు నాటి డ్రిప్ పథకాలు ఎక్కడని..అంటూ టీడీపీ అధినేత ప్రశ్నలు సంధించారు. సమాధానం చెప్పి సభ పెడతావా.... సభలో సమాధానం చెపుతావా? అంటూ సీఎం జగన్ ను చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రశ్నల పైన జగన్ స్పందిస్తారా లేదా.. సభలో ఏ రకంగా చంద్రబాబును టార్గెట్ చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+