ప్రజా తీర్పును తిరుగుబాటుగా చూడాలి - చంద్రబాబు..!!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకతను చాటారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకతను చాటారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో గెలుపును ప్రజా విజయంగా చంద్రబాబు అభివర్ణించారు. ఉత్తరాంధ్ర తో పాటుగా రాయలసీమలోని రెండు స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధించింది. పీడీఎఫ్ తో అవగాహన టీడీపీకి కలిసి వచ్చింది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీడీపీ గెలుపొందింది.

ఈ విజయం పైన స్పందించిన చంద్రబాబు ప్రజలు ఉగాది పంచాగాన్ని రెండు రోజుల ముందే చెప్పారని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏం నష్టపోయిందో ప్రజలు గమనించారని చెప్పుకొచ్చారు.

TDP Chief Chandra Babu Reacts on MLC Election Results, says its public mood against the Govt

రాష్ట్రంలో పరిస్థితులు చూసి బాధ..చైతన్యంతో ప్రజలు ఓట్లు వేసారని చంద్రబాబు చెప్పారు. నాలుగేళ్ల కాలంలో జగన్ విధ్వంస పాలన చేసారని ఆరోపించారు. మంచి గెలుస్తుందని..చెడు ఎప్పుడైనా ఓడిపోతుందని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ ఎన్నికల్లో మళ్లీ గెలిచే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. తాత్కాలిక ఇబ్బందులు ఉన్నాటీడీపీకి జనా బలం ఉందన్నారు.

నాలుగేళ్లలో రాజకీయ పార్టీలు పని చేసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడితే కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. పులివెందుల లోనూ తిరుగుబాబు ప్రారంభమైందన్నారు. రాష్ట్రం ఏమైనా పర్వాలేదు..తానొక్కరే ఉండాలనేది జగన్ విధానమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నాలుగు వ్యవస్థలు పని చేయటం లేదన్నారు.

TDP Chief Chandra Babu Reacts on MLC Election Results, says its public mood against the Govt

అసెంబ్లీ, కౌన్సిల్ ను ప్రహసనంగా మార్చారని చంద్రబాబు విమర్శించారు. ఎవరూ నిరసనలు చేయకుండానే జీవో నెంబర్ 1 తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. సీఎస్ సహా అధికారులను కోర్టు చీవాట్లు పెట్టే పరిస్థితులు చూస్తున్నామన్నారు. కొన్ని పార్టీలు సిద్దాంతపరంగా రావని వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పట్టభద్రుల ఎన్నికల్లో రాంగోపాల్ రెడ్డి ప్రజా విజయంగా పేర్కొన్నారు.

తెలుగుదేశానిది జనబలం.. వైసీపీది ధనబలంగా అభివర్ణించారు. 40 ఏళ్లు చూడని అక్రమాలు ఈ నాలుగేళ్లలో చూశానని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ పైన చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వచ్చే ఎన్నికలు జగన్ వర్సెస్ పబ్లిక్ అనే విధంగా జరుగుతాయని చంద్రబాబు విశ్లేషించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+