కుప్పంలో సులువుగా గెలిచేవాడిని..కానీ, : తప్పదు- అపార్దం చేసుకోవద్దు : చంద్రబాబు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ నేతలకు కీలక అంశాలైన స్పష్టత ఇచ్చారు. ఇంట్లో కూర్చుంటే కుదరదు.. పార్టీ కోసం కష్టపడకుండా ఎన్నికల్లో సీట్లు కావాలంటే కుదరదని తేల్చి చెప్పారు. అందరూ కలిసి సర్వ శక్తులు ఒడ్డి సమర్ధవంతంగా పోరాడితే తప్ప ఈ సారి ఎన్నికలను ఎదుర్కొనలేమని చంద్రబాబు తేల్చి చెప్పారు. పార్టీ నేతలతో సమావేశమైన సమయంలో కుప్పంలో పరిస్థితులను చంద్రబాబు ప్రస్తావించారు.

తాను చేసిన ఛాలెంజన్ ను ప్రస్తావిస్తూ

తాను చేసిన ఛాలెంజన్ ను ప్రస్తావిస్తూ

తన సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రతీ సారి 60 వేల నుంచి 70 వేల ఓట్ల మెజార్టీతో అతి సునాయాసంగా గెలిచే పరిస్థితి ఉండేదన్నారు. కానీ, ఇప్పుడు అక్కడ గొడవలు పెట్టే పరిస్థితికి వచ్చారని..దీనిని అందరూ గుర్తించాలని కోరారు. తాను మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచిన తర్వాతే అసెంబ్లీలోకి వస్తానని చాలా స్పష్టంగా చెప్పానని... అది పార్టీ నేతల మనస్సుల్లో ఉండాలంటూ చంద్రబాబు పేర్కొన్నారు. సంప్రదాయ రాజకీయాలు సరి కాదని వ్యాఖ్యానించారు. అలా కాకుండా ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుని.. ఇంట్లో కూర్చుంటే కుదరదని స్పష్టం చేసారు. ఈ సారి ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తామని ఇప్పటికే చెప్పామని గుర్తు చేసారు.

వారికి టిక్కెట్లు ఇచ్చేది లేదు

వారికి టిక్కెట్లు ఇచ్చేది లేదు

ఎవరూ తనను అపార్ధం చేసుకోవద్దని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నియోజకవర్గ ఇన్‌చార్జి నెలకు 20 రోజులు నియోజకవర్గంలో ఉండాలని చంద్రబాబు నిర్దేశించారు. పార్టీలో గ్రూపులు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసారు. పార్టీ నాయకులు పట్టింపులు, ఇగోలు విడిచిపెట్టాలన్నారు. అలసత్వంగా ఉంటే ముందుకు పోలేమని వివరించారు.

నియోజకవర్గ ఇన్‌చార్జి నెలకు 20 రోజులు నియోజకవర్గంలో ఉండాలని చెప్పారు. రెండు పార్లమెంట్‌లకు ఒక పరిశీలకుడు ఫీల్డ్‌లోనే ఉండాలని స్పష్టం చేసారు. ఇన్‌చార్జిలే పార్టీ నాయకులు, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. ఎన్నిసార్లు దాడులు చేసినా అన్న క్యాంటీన్లు కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టంచేశారు.

ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం

ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం

రాష్ట్ర నాయకత్వంతోపాటు స్థానిక నాయకత్వం కూడా సమర్థంగా పనిచేస్తేనే పార్టీ కార్యకర్తలు, ప్రజలు ముందుకు వస్తారని చెప్పారు. ర్టీ బాధ్యతలను నిర్వర్తించకుండా కాడి పడేసే నాయకుల్ని మార్చడానికి వెనకాడమని తేల్చి చెప్పారు. పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులపై ప్రైవేటు కేసులు వేయాలని చంద్రబాబు సూచించారు. వేధింపుల కారణంగా జైలుకు వెళ్లిన పార్టీ నాయకులు.. కార్యకర్తలను బయటకు తీసుకురావటానికి ఎన్ని కోట్లయినా ఖర్చు పెడతామని చంద్రబాబు స్పష్టం చేసారు. ఈ నెల నుంచి నిర్దిష్టమైన కార్యక్రమాలు ఉంటాయని నేతలకు చంద్రబాబు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+