కోడెల శివరాంకు మద్దతుగా మాజీ మంత్రి - చంద్రబాబు సీరియస్..!!
పల్నాడు టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సత్తెనపల్లి ఇంఛార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణను ప్రకటన కొత్త సమస్యలకు కారణమవుతోంది. కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం ఈ నిర్ణయం పైన ఆగ్రహంగా ఉన్నారు. ఆయన్ను బుజ్జగించేందుకు సీనియర్లు రంగంలోకి దిగారు. చంద్రబాబుతో కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వటం లేదంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇప్పుడు శివరాంకు మద్దతుగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేసిన కామెంట్స్ పై చంద్రబాబు సీరియస్ అయ్యారు.
పల్నాడు నేతల వ్యాఖ్యలతో: సత్తెనపల్లి ఇంఛార్జ్ గా నియామకంతో వచ్చే ఎన్నికల్లో అక్కడ టీడీపీ అభ్యర్ధిగా కన్నా లక్ష్మీనారాయణ పేరు ఖరారైంది. దీని పైన కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీలో పనిచేసిన మరణించిన సీనియర్ల కుటుంబ సభ్యులకు ఇచ్చిన ప్రాధాన్యత తమకు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబును దూషించిన కన్నాకు సత్తెనపల్లి సీటు ఇచ్చి కోడెల హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

తాము చంద్రబాబును కలుద్దామని పలు సార్లు కోరినా అవకాశం దక్కలేదని చెప్పుకొచ్చారు. దీంతో, పార్టీ సీనియర్లను శివరాం వద్దకు చంద్రబాబు పంపారు. నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు సుదీర్ఘ మంతనాలు చేసారు. శివరాం వాదన విన్నారు. చంద్రబాబుకు నివేదిస్తామని హామీ ఇచ్చారు.
శివరాంకు న్యాయం చేయాలి: ఇటు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల్లో గెలిచే వారికే సీట్లు ఇవ్వాలని పేర్కొన్నారు. ఓడుతారని భావిస్తే మోహమాటాలు అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఎవరో ట్రస్టులు, ఫౌండేషన్ పేర్లతో కొంత మేర ఖర్చు పెడితే వారికి టికెట్లు ఇస్తారా అని ప్రశ్నించారు. చిలకలూరిపేట నుంచి వచ్చే ఎన్నికల్లో భాష్యం ప్రవీణ్ కు సీటు ఇస్తారనే ప్రచారం పైన ఆయన స్పందించారు.
ఎన్నికల ముందు వచ్చి పంపకాలు చేస్తే..ఎన్నికల తరువాత పార్టీని చూసుకొనేది ఎవరని నిలదీసారు. చిలకలూరిపేటలో బాష్యం ప్రవీణ్ కు ఓటు హక్కు కూడా లేదన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పని చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కోడెల శివరాం కు న్యాయం చేయాలని పుల్లారావు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఆగ్రహం: ఈ పరిణామాల పైన ఈ రోజు (శనివారం) ఉదయం జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో అధినేత చంద్రబాబు దృష్టికి పార్టీ వర్గాలు తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చంద్రబాబు... పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా, పార్టీకి నష్టం చేసే వారి విషయంలో ఉపేక్షించాల్సిన అవసరం లేదని అన్నారు. పార్టీ నిర్ణయాలను తప్పు పడుతూ.. మీడియాలో వ్యాఖ్యలు చేసే వారిపై కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని అధినేత స్పష్టం చేశారు.
పార్టీ నేతలు ఆయా అంశాలపై తమ అభిప్రాయాలు అధిష్టానానికి చెప్పాలి తప్ప. బహిరంగ చర్చ పెట్టడం మంచిది కాదన్నారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఏ స్థాయి నేతలైనా సహించేది లేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీంతో, పల్నాడు టీడీపీలో నేతలను సంతృప్తి పర్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications