బీజేపీ సత్యకుమార్ కారుపై దాడిని ఖండించిన చంద్రబాబు-పక్కా ప్లాన్ తోనే-పోలీసులెందుకు అడ్డుకోలేదు ?

అమరావతి ఉద్యమం 1200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రైతులు నిర్వహిస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు వెళ్లి వస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కారుపై మూడు రాజులకు అనుకూలంగా ఉన్న కొందరు దాడులకు దిగారు. ఇందులో సత్యకుమార్ అనుచరులకు గాయాలయ్యాయి. ఈ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు.

అమరావతి ఉద్యమానికి మద్దతు పలికి వస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై వైసీపీ గూండాల దాడిని ఖండిస్తున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై వైసీపీ మూకలు దాడులకు పాల్పడుతున్నాయన్నారు. అక్కడే ఉన్న పోలీసులు దుండగులను ఎందుకు అడ్డుకోలేదు? అని
చంద్రబాబు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ లో వ్యాఖ్యానించారు.

tdp chief chandrababu condemn attack on bjp national secretary satyakumars car in amaravati

అమరావతి ఉద్యమం 1200 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇవాళ స్ధానికంగా పలు గ్రామాల్లో రైతులు నిరసనలు చేపట్టారు. వీటికి మద్దతు తెలిపేందుకు బీజేపీతో పాటు టీడీపీ, సీపీఎం, సీపీఐ నేతలు వచ్చారు. వైసీపీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వచ్చారు. ఈ సందర్భంగా మూడు రాజధానులకు మద్దతుగా ఆయా గ్రామాల్లో ఉన్న వైసీపీ నేతలకూ వీరికి మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+