కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెంట‌నే కుప్పం రావాలంటూ వాట్సాప్ సందేశాలు?

|
Google Oneindia TeluguNews

కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబు రెండోరోజు ప‌ర్య‌ట‌ను అడ్డుకుంటామంటూ వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ప్ర‌క‌టించ‌డంతోపాటు ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకునేందుకు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో పాఠ‌శాల‌లు, ప్ర‌యివేటు సంస్థ‌లు, షాపులు మూత‌ప‌డ్డాయి. కుప్పం ప‌రిధిలోని ఆర్టీసీ బ‌స్సుల‌న్నీ డిపోకే ప‌రిమిత‌మ‌య్యాయి. ప‌ట్ట‌ణంలో ఎటువంటి అవాంఛ‌నీ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేయ‌డంతోపాటు ప‌ట్ట‌ణం న‌లువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

 భారీగా తరలివస్తున్న శ్రేణులు

భారీగా తరలివస్తున్న శ్రేణులు


చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ఎత్తున కుప్పంకు రావాలంటూ చిత్తూరు పార్ల‌మెంటు అధ్య‌క్షుడు పులివ‌ర్తి నాని పిలుపునివ్వ‌డంతో ప‌ట్ట‌ణంలోని ఆ పార్టీ శ్రేణులు భారీగా త‌ర‌లివ‌స్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రామ‌కుప్పంలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టేందుకు సిద్ధ‌పడుతున్నాయి. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కుప్పం చేరుకోవాలంటూ ఇప్ప‌టికే వాట్సాప్ సందేశాలు వెళ్లాయి. టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లకు కూడా వాట్సాప్ సందేశాలు అందాయి.

పట్టణంలో టెన్షన్ వాతావరణం

పట్టణంలో టెన్షన్ వాతావరణం


తెలుగుదేశం, వైసీపీ హోరాహోరీగా పోటీ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు సిద్ధ‌ప‌డుతుండటంతో ప‌ట్ట‌ణంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అనే టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. రామ‌కుప్పం మండ‌లం కొల్లుప‌ల్లెలో తెలుగుదేశం, వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ పున‌రావృతం కాకుండా జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ప‌ట్ట‌ణం న‌లువైపులా పోలీసులు మొహ‌రించారు.

 ఉద్రిక్తంగా బాబు పర్యటన

ఉద్రిక్తంగా బాబు పర్యటన


చంద్ర‌బాబునాయుడి మూడురోజుల కుప్పం ప‌ర్య‌ట‌న అత్యంత ఉద్రిక్త ప‌రిస్థితుల మ‌ధ్య జ‌రుగుతోంది. మొద‌టిరోజు పార్టీ తోర‌ణాల ప‌క్క‌నే వైసీపీ తోర‌ణాలు క‌ట్ట‌డంతో వివాదం ప్రారంభ‌మైంది. అది చిలికి చిలికి గాలివాన‌లో మారి పోలీసులు లాఠీఛార్జి చేసేవ‌ర‌కు వెళ్లింది. రెండోరోజు బాబు అన్న క్యాంటిన్‌ను ప్రారంభించాల్సి ఉండ‌గా దాన్ని వైసీపీ శ్రుణులు ధ్వంసం చేయ‌డంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది.

English summary
The ranks of the YSR Congress Party are preparing to hold a protest demonstration at Ramkuppam.WhatsApp messages have already gone out asking party leaders and workers to reach Kuppam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X