సమయం మించిపోయింది - పొత్తులపై చంద్రబాబు సంచలనం..!!
ఎన్నికల వేల పొత్తులపై టిడిపి అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బిజెపితో పొత్తుకు సమయం మించిపోయిందని వెల్లడించారు. ఏపీలో పొత్తుల పైన సమయానుకూలంగా నిర్ణయాలు ఉంటాయని స్పష్టత ఇచ్చారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్రకు తాను సిద్ధంగా ఉన్నానని, కాలమే అన్నిటినీ నిర్ణయిస్తుందంటూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టిడిపి అధినేత చంద్రబాబు మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఎన్టీఆర్ స్మారక చిహ్నం ఆవిష్కరణలో పాల్గొన్న చంద్రబాబు, అదే సమయంలో బిజెపి అధ్యక్షుడు నడ్డాతోను మంతనాలు జరిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోను కలిసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. జాతీయ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన చంద్రబాబు తెలుగు రాష్ట్రాల్లో పొత్తుల పైన తన వైఖరి స్పష్టం చేశారు.

తెలంగాణలో బిజెపితో పొత్తుకు అవకాశం లేదని ఇప్పటికే సమయం మించి పోయిందని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో టిడిపి ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఇప్పటికే నియమించిన కమిటీ ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశం పైన సూచనలు చేస్తోందని స్పష్టం చేశారు. ఇండియా కూటమికి సంబంధించి చంద్రబాబు స్పందించారు. దక్షిణాదిలో తెలంగాణ కర్ణాటకలో మినహా కాంగ్రెస్ పార్టీ లేదన్నారు. ఏపీ, తమిళనాడులో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఇండియా కూటమిలో నేతలు చాలామంది ఉన్నారని కన్వీనర్ ఎవరనేది వాళ్ళు తెల్చుకోవాల్సిన విషయంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నానని, కాలమే దీనికి సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు. రాజకీయంగా అనుభవం ఉన్నవారు ఎవరు ప్రధాని మోడీ పైన విమర్శలు చేయటం లేదంటూ చంద్రబాబు ఆసక్తికర కామెంట్ చేశారు.

ఏపీలో జగన్ ఓటమి ఖాయమైందని చంద్రబాబు జోస్యం చెప్పారు.ఏపీ బాగుపడాలంటే జగన్ ను గద్దె దించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు ఏపీలో ఎన్నికల సమయంలో అవసరాన్ని బట్టి పొత్తులు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు. జనసేన తో సహా ఏ పార్టీతో పొత్తు అనేది ఎన్నికల ముందే తేలుతుందని క్లారిటీ ఇచ్చారు. ఏపీ పునర్ నిర్మాణంలో భాగంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యత, వారి సహకారం అవసరమవుతుందని చంద్రబాబు ప్రస్తావించారు. ఏపీలో సాధ్యమైనంతవరకు అభ్యర్థులను టిడిపి ఒకేసారి ప్రకటిస్తుందని చంద్రబాబు వెల్లడించారు. పోటీ చేసేందుకు టిడిపి నుంచి అభ్యర్థులు క్యూలో ఉన్నారన్నారు తాము గేట్లు తెరిస్తే వైసిపి నేతలు అంతా టిడిపిలోకి వచ్చేలా ఉన్నారని, అప్పుడు వైసిపి టిడిపి అవుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications