రికార్డు సృష్టించిన చంద్రబాబునాయుడు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రికార్డు సృష్టించారు. 72 సంవత్సరాల వయసులో కూడా యువకులతో పోటీపడుతూ, వారికి స్ఫూర్తిగా నిలిచే పనితీరును కనపరుస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలుండగా ప్రస్తుతానికి చంద్రబాబు 111 నియోజకవర్గాల్లో సమీక్ష పూర్తి చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది.

వైసీపీని ఎదుర్కొనే వ్యూహాలు..
నియోజకవర్గ
సమీక్షల్లో
భాగంగా
చంద్రబాబుకు
ఎదురైన
అనుభవాలు..
పార్టీకి
ప్లస్
పాయింట్లు,
మైనస్
పాయింట్లు,
నేతల
పనితీరు
బాగున్న
నియోజకవర్గాలు,
బాగోలేనివి,
మధ్యస్థంగా
ఉన్న
నియోజకవర్గాలను
ఆయన
గుర్తించారు.
ఇన్చార్జిల
పనితీరు
మెరుగుపరుచుకోవడానికి
అనుసరించాల్సిన
నియమాలు,
వైఎస్సార్
కాంగ్రెస్
పార్టీని
ఎదుర్కోవడానికి
తగినన్ని
వ్యూహాలు,
టీడీపీ
అనుసరించబోయే
విధానాలను
ఆయన
ఈ
సమీక్షల్లో
నేతలందరికీ
వివరించుకుంటూ
వచ్చారు.

ఇంతమంది నాయకులకు చంద్రబాబు ఏం చెప్పారు?
ఇంతమంది
నాయకులకు
చంద్రబాబు
ఏం
చెప్పివుంటారా?
అనే
ఆసక్తి
రాజకీయ
వర్గాల్లో
నెలకొంది.
నేతలంతా
అందరినీ
కలుపుకొని
ముందుకు
సాగడం,
సమన్వయం
చేసుకోవడంపై
దృష్టిసారించాలనేది
ప్రధాన
అంశంగా
ఉంది.
గత
ఎన్నికల్లో
పార్టీ
దెబ్బతినడానికి,
ఎమ్మెల్యే
అభ్యర్థులు
ఓటమిపాలు
కావడానికి
కేవలం
సమైక్యత
లేకపోవడంవల్లే
జరిగిందని
బాబు
తేల్చిచెప్పారు.
తాను
ఇన్
ఛార్జిలుగా
ప్రకటించినవారంతా
ఇతర
నాయకులను
సమన్వయం
చేసుకొని
ముందుకు
సాగాల్సిందేనని,
ఈ
విషయంలో
వారికి
రెండో
అవకాశం
లేదని,
ఇష్టంలేనివారు
ముందే
చెబితే
సీట్లు
వేరేవారికి
కేటాయిస్తానని
ఖరాఖండిగా
చెప్పేశారు.

చంద్రబాబు గుర్తించిన ప్రధాన అంశం
ఇప్పటికే
చంద్రబాబునాయుడు
తన
స్వభావశైలికి
విరుద్ధంగా
వ్యవహరిస్తున్నారు.
ఎన్నికలకు
ఏడాదిన్నర
ముందుగానే
అభ్యర్థులను
ప్రకటించుకుంటూ
వస్తున్నారు.
అంతేకాకుండా
మొహమాటాన్ని
వదిలించుకుంటున్నారు.
పార్టీకి
తెల్ల
ఏనుగుల్లా
మారిన
సీనియర్లకు
సీట్లు
నిరాకరించడంద్వారా
దుడుకు
వైఖరిని
కనపరుస్తున్నారు.
111
నియోజకవర్గాల
సమీక్షలో
సగం
మంది
నాయకులు
ప్రజలతో
మమేకమవడం
లేదని,
ఇతర
నాయకులను
సమన్వయం
చేసుకోవడంలేదని,
2019
ఎన్నికలకు
ముందు
వైసీపీ
నాయకులు
ఎంత
ఐకమత్యంగా
పనిచేశారో
ఉదాహరణతో
చెబుతున్నారు.
ఏడాది,
ఏడాదిన్నర
ముందుగానే
అభ్యర్థులను
ప్రకటించడంవల్ల
అసమ్మతిని
వదిలించుకోవచ్చని
బాబు
భావిస్తున్నారు.
మిగిలిన
64
నియోజకవర్గాల
సమీక్షలను
కూడా
త్వరలోనే
పూర్తిచేయనున్నారు.