వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూండాల‌ను ప్రోత్స‌హిస్తున్న వైసీపీ.. పథకం ప్రకారం ఎన్టీఆర్ విగ్ర‌హం ద్వంసం.. డీజీపీకి చంద్ర‌బాబు లేఖ‌

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో మహానీయుల విగ్రహాలను ద్వంసం చేసేందుకు అధికార పార్టీ గూండాలను ప్రోత్సహిస్తుందని టీడీపీ అదినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం ద్వంసంపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఆయన ఘాటుగా లేఖ రాశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ తరహా ఘటనలు కొసాగుతున్నాయని మండిపడ్డారు. ప్రణాళికబద్ధంగా జరుగుతున్న దాడులల్లో పోలీసులు అలసత్వం ప్రదర్శించడం తగదని హితవు పలికారు. మహానీయుల విగ్రహాల ద్వంసం కొనసాగితే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

 ప్ర‌జ‌ల‌ మధ్య విద్వేషాలు రెచ్చకొట్టేలా..

ప్ర‌జ‌ల‌ మధ్య విద్వేషాలు రెచ్చకొట్టేలా..


గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం ద్వంసం ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజాస్వాయ్యాన్ని అధికార పార్టీ తుంగలో తొక్కిందన్నారు.
వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు శెట్టిపల్లి యలమంద కుమారుడు కోటేశ్వర్ రావు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని మండిపడ్డారు. వివిద వర్గాల ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చకొట్టే కుట్రలో భాగంగానే ఎన్టీఆర్ విగ్రహాన్ని ద్వంసం చేశారని దుయ్యబట్టారు. ఈ మేరకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసంపై డీజిపీ గౌతమ్‌ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు

 ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు..

ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు..


రాష్ట్రంలో 2019 నుంచి ప్రణాళికబద్ధంగా మహానీయుల విగ్రహాల ద్వంసం ఘటనలు కొనసాగుతున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు అధికార వైసీపీ నేతల ఆదేశాల మేరకే జరుగుతున్నాయనడానికి ఎన్టీఆర్ విగ్రహ విధ్వంసమే నిదర్శమని మండిపడ్డారు. మహానీయుల విగ్రహాలపై ఇలాంటి ఘటన జరుగుతున్నప్పుడు పోలీసులు అలసత్వం ప్రదర్శించడం తగదని హితవు పలికారు.

నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారనే అనుమానాలు..

నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారనే అనుమానాలు..


ఏపీలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి జాతీయ నాయకులైన డా. బి.ఆర్‌ అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ ల విగ్రహాలను ధ్వంసం చేసేందుకు వైసీపీ గూండాలను ప్రోత్సహింస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఇలాంటి విధ్వంసాలను ప్రోత్సహించడంలో నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో సర్వత్రా వ్యక్తమవుతోందన్నారు. ఎన్టీఆర్ విగ్ర‌హం ద్వంసం సంఘటనపై ఇప్పటికైనా పోలీసులు సమగ్ర విచారణ జరిపి.. దోషులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చూడాలి డీజీపీని చంద్రబాబు లేఖలో కోరారు. ఎన్టీఎస్ విగ్రహాం ద్వంసంపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలను పోలీసులు అదుపులోకి తీసుకోవటం తగదని హితవు పలికారు.

English summary
Chandrababu Naidu writes letter to AP DGP over NTR Idol destroyed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X