అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు కొత్త ఫార్ములా : 23+1+53

|
Google Oneindia TeluguNews

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా జరిగిన పొరపాట్లు, తప్పులు ఈసారి జరగకుండా ఇప్పటినుంచే జాగ్రత్తపడుతున్నారు. జనసేన విడిగా పోటీచేయడంవల్ల ఎన్ని నియోజకవర్గాల్లో తేడా వచ్చింది? వాటిల్లో జనసేనకు పోలైన ఓట్లు ఎన్ని? టీడీపీకి పడిన ఓట్లు ఎన్ని? వైసీపీ మెజారిటీ ఎంత? అనేదానిపై దృష్టిసారించారు. వివరాలన్నీ తెప్పించుకొని తన బుర్రకు పదును పెట్టారు.

జనసేనవల్ల 53 స్థానాల్లో ఓటమి

జనసేనవల్ల 53 స్థానాల్లో ఓటమి

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 సీట్లకే పరిమితమైంది. జనసేన ఒక నియోజకవర్గాన్ని దక్కించుకుంది. జనసేన విడిగా పోటీచేయడంవల్ల తెలుగుదేశం పార్టీ 53 నియోజకవర్గాల్లో ఓటమిపాలైంది. ఆ నియోజకవర్గాల్లో వైసీపీకి వచ్చిన మెజారిటీకన్నా జనసేనకు వచ్చిన ఓట్ల సంఖ్య ఎక్కువ. తెలుగుదేశం, జనసేన.. రెండు పార్టీలకు పోలైన ఓట్లను కలిపితే వైసీపీకి వచ్చిన మెజారిటీ చాలా తక్కువ. ఆ నియోజకవర్గాలన్నింటినీ ప్రత్యేకంగా కోట్ చేసిన చంద్రబాబు వాటిపై సీరియస్ గా దృష్టిసారించారు.

ఈ 53 నియోజకవర్గాల్లో సమీక్షలు పూర్తి

ఈ 53 నియోజకవర్గాల్లో సమీక్షలు పూర్తి

ఇప్పటివరకు 156 నియోజకవర్గాల్లో సమీక్షలు పూర్తికాగా అందులో ఈ 53 కూడా ఉన్నాయి. స్థానిక నేతలకు తెలియకుండా ఈ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏమిటి? గత ఎన్నికలకు, ప్రస్తుతానికి తేడా ఏమిటి? ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల ఆలోచనా తీరు? అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? తదితర విషయాలపై సర్వే చేయించి నివేదిక తెప్పించుకున్నారు. వాటిని బట్టి ఇక్కడ అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారు. రానున్న ఎన్నికల్లో గత ఎన్నికల్లో గెలిచిన 23 స్థానాలకు అదనంగా ఈ 53 సీట్లు కూడా గెలుచుకోవాలనేది చంద్రబాబు ప్రణాళికగా ఉంది. మొత్తం కలిపితే 76 నియోజకవర్గాలవుతాయి. గత ఎన్నికల్లో జనసేన గెలిచిన నియోజకవర్గాన్ని కలుపుకుంటే 77 అవుతాయి. మెజారిటీకి 88 సీట్లు అవసరమవుతాయి. అంటే మరో 11 నియోజకవర్గాల్లో కష్టపడాల్సి ఉంటుంది.

సంశయంలో చంద్రబాబు?

సంశయంలో చంద్రబాబు?

తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు ఉంటుందని భావిస్తున్న తరుణంలో జనసేనకు కేటాయించే నియోజకవర్గాలను ఈ 53లో కేటాయించాలా? వద్దా? అనే సంశయంలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. గట్టిగా కృషిచేస్తే ఆ 53 సునాయాసంగా టీడీపీ ఖాతాలో పడతాయని, అక్కడి ఓటుబ్యాంకును పోగొట్టుకోకుండా జనసేనకు బలమున్న చోట్ల, ఆ పార్టీకి బలమైన అభ్యర్థులున్న నియోజకవర్గాలనే కేటాయించాలని టీడీపీ భావిస్తోంది.

English summary
Telugu Desam Party chief Chandrababu Naidu is working hard to win the next election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X