మారరా.. మీరు మారరా? ఎందుకని??

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన సహజశైలికి భిన్నంగా దూకుడుగా రాజకీయం చేస్తున్నారని, ఏడాదిన్నర ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 10 నిముషాల్లో నామినేషన్ల సమయం ముగియబోతుందనగా అభ్యర్థులను ఖరారు చేసే చంద్రబాబు ఏడాదిన్నర ముందుగానే ఖరారు చేయడమంటే సంచలనం అనే చెప్పాలి.

ఇంకా మారాల్సిన అవసరం చాలావుంది

ఇంకా మారాల్సిన అవసరం చాలావుంది

అయితే ఇంకా ఇంకా మార్పు రావల్సిన అవసరం ఉందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. తెగువగా ఒక నిర్ణయం తీసుకోవడంతోపాటు ఏదైతే అదవుతుంది.. లాభమైనా, నష్టమైనా మనదే బాధ్యత అనే ధోరణిలో మాత్రం నిర్ణయాలు తీసుకోవడంలేదంటున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి జగన్ తాను ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే చివరివరకు దానికే కట్టుబడి ఉంటారు. దానివల్ల లాభం జరగనీ.. నష్టం జరగనీ.. అంతిమంగా అదే నిర్ణయం. కానీ చంద్రబాబునాయుడు మాత్రం తెగింపుతో నిర్ణయాలు తీసుకోలేకపోతుండటం ప్రధానలోటుగా కనపడుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇప్పటికీ సాచివేత ధోరణే..

ఇప్పటికీ సాచివేత ధోరణే..

ఇప్పటికీ సాచివేత ధోరణి, సాగదీత ధోరణిలోనే చంద్రబాబునాయుడు ఉన్నారని, ఇలాగే సమయమంతా వృథా చేస్తే అంతిమంగా పార్టీయే నష్టపోవాల్సి వస్తుందని తెలుగు తమ్ముళ్లు తమలో తామే చర్చించుకుంటున్నారు. నాయ‌కుల‌ను ప‌ట్టుకుని చంద్రబాబు వేలాడుతున్నారో.. చంద్రబాబును పట్టుకొని నాయ‌కులు వేలాడుతున్నారో తెలియని స్థితిలో పార్టీ ఉంది. జిల్లాల పర్యటనల చేస్తూ అభ్యర్థులను పనిచేసుకోండి అని చెబుతూ వస్తున్న చంద్రబాబును చూసిన పార్టీ శ్రేణులు తమ నేత మారారనుకున్నారు. కానీ ఉదాహరణకు చూస్తే విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహరించిన తీరుపై కేసీఆరో, జగనో అయితే ఇప్పటికే చర్యలు తీసుకునేవారు. ఏమాత్రం అటువంటి క్రమశిక్షణ లేని నాయకులను ఉపేక్షించేవారే కాదు. కానీ అటువంటి నాయకుడిపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదా? అని తమలో తామే చర్చించుకుంటున్నారు.

ఉదాహరణలివిగో అంటున్న తమ్ముళ్లు..

ఉదాహరణలివిగో అంటున్న తమ్ముళ్లు..

ఏడాదిన్నర ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తున్నానని చెబుతున్న చంద్రబాబు తాజాగా రాజాం పర్యటన ముగించుకున్నారు. ఇక్కడ ప్రతిభా భారతి, కొండ్రు మురళి వర్గాలు సీటు కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇప్పుడే సీటు ఎవరికన్నది చెప్పేస్తే అసమ్మతి ఉంటే అర్థమవుతుందని, అందుకనుగుణంగా చర్యలు తీసుకోవడానికి సమయం దొరుకుతుందని, అలాకాకుండా ఎన్నికల చివరివరకు నాన్చితే నష్టపోవాల్సి వస్తోందంటూ తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెడుతున్నారు. ఇదే కాకుండా ఆళ్లగడ్డలో అఖిలప్రియకు సీటిస్తారా? లేదా? అనేది ఖరాఖండిగా చెప్పేస్తే స్పష్టత వస్తుందని, ఈ నాన్చివేత ధోరణులు, నాన్చుడు బేరాలవల్లే పార్టీ ఎన్నికల సమయంలో నష్టపోవాల్సి వస్తోందని, ఏమైనప్పటికీ తీసుకునే నిర్ణయాలు ఎలాంటివైనా బాధ్యత నాదే.. అనే ధోరణితో సత్వర నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు విన్నవించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+