టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మాట్లాడిన ప్రతిసారీ విపక్షాలు విమర్శిస్తుండటంతో అందులో లోపాలు ఏమున్నాయనే విషయంపై దృష్టి పెట్టినట్లున్నారు. ఎక్కడ మాట్లాడినా పదే పదే హైదరాబాద్ అభివృద్ధి చేసింది తానే అంటూ చెప్పే సంగతి తెలిసిందే. దీంతో ఇకనుంచి ఎక్కడ మాట్లాడినా హైదరాబాద్ విషయాన్ని ప్రస్తావించబోనని వ్యాఖ్యానించారు.
సైబరాబాద్ కట్టింది తానేనని, విజన్ 2020తో అభివృద్ధి చేశానని తరచుగా చంద్రబాబు ప్రస్తావిస్తుంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా అవే మాటలు చెబుతుండటంతో వైసీపీ, బీఆర్ ఎస్ నేతల నుంచే కాకుండా సొంతపార్టీ నాయకుల నుంచి కూడా విమర్శలను ఎదుర్కొన్నారు. చంద్రబాబు హైదరాబాద్ గురించి మాట్లాడనని చెప్పడం వింతగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.

హైదరాబాద్ అభివృద్ధి విషయం వదిలేసి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శల ఘాటు పెంచాలని చంద్రబాబు నిర్ణయించారు. ఎక్కడ, ఏ విషయాన్ని ప్రస్తావించినా సబ్జెక్టుల వారీగా ఒక్కో అంశంపై మాట్లాడనున్నట్లు వెల్లడించారు. ఈసారి ఎన్నికలప్పుడు కచ్చితంగా ఓడిపోతామనే ఫ్రస్టేషన్ లో వైసీపీ నేతలున్నారని, వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఎక్స్ పైరీ డేట్ అయిపోయిందన్నారు.
ఏ మందు వాడాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఇకనుంచి తాను మాట్లాడే ప్రతి అంశాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని, ఎందుకంటే తాను మాట్లాడేది వారికోసమేనన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.












Click it and Unblock the Notifications