తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్.. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామన్న చంద్రబాబు

తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలు దిక్కులా చాటిన స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 26వ వర్ధంతి ఇవాళ. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళుల్పించారు. ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. మహానుభావుడు వర్థంతిని పురష్కరించుకోని ఎన్టీఆర్ భవన్‌లో లెజెండరీ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మ‌హానాయుకుడు అగుడుజాడ‌ల్లో ప్ర‌జల కోసం నిరంత‌రం ప‌నిచేస్తామ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు చెప్పారు.

మ‌హానాయుకుడు అగుడుజాడ‌ల్లో..

బడుగు , బలహీనవర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ నందమూరి తారాక రామారావు అని అన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. తెలుగువారి ఆత్మగౌరవానికి, ప్రజాహిత పాలనకు ప్రతీక అని కొనియాడారు. కొందరి చేతుల్లోనే ఉన్న అధికారాన్ని అందరికీ చేరువ చేసిన యుగపురుషుడు తారక రాముడని పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి తో ప్రజల కోసం టీడీపీ నిరంతరం పని చేస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ కథానాయకునిగా.. మహా నాయకునిగా వెలిగిన ఎన్టీఆర్ 26 వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను అని చంద్రబాబు ట్విట్ చేశారు.

సవాళ్ల‌ను విజయాలుగా మార్చుకున్న ఎన్టీఆర్ ..

తనకు ఎదురైన ప్రతి సవాలునూ సంచలన విజయంగా మార్చుకున్న నిజమైన కథానాయకుడు ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పేర్కొన్నారు. నిజాయితీ, నిబద్ధత, నిస్వార్ధం, నిర్భీతి.. ఇవే ఎన్టీఆర్ ఆయుధాలనన్నారు. అందుకే ఆయన ఎన్నో సాహసోపేత నిర్ణయాలను తీసుకుని వ్యవస్థలను సంస్కరించగలిగారు.

తెలుగుజాతి ముద్దుబిడ్డడు కాగలిగారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ 26వ వర్థంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మృతికి అంజలి ఘటిస్తున్నానన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని అందుకుని.. దొంగలు, దోపిడీదారులు, అహంకార దొరలు లేని అసలైన సర్వజన సంక్షేమ రాజ్యం స్థాపించేందుకు మనందరం కృషిచేద్దామని ట్విట్ చేశారు లోకేష్.

ఎన్టీఆర్‌ భారతరత్నతో గౌరవించుకోవాలి..

ఎన్టీఆర్‌ భారతరత్నతో గౌరవించుకోవాలి..

తెలుగు వారి సత్తాను ప్రపంచానికి చాటిన మహానుబావుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు అని కొనియాడారు వైసీపీ ఎంపీ రఘరామకృష్ణరాజు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయ‌న‌ నివాళుల్పించారు. భారతరత్నతో తెలుగు ప్రజలు యుగపురుషుడని గౌరవించుకోవాలని అన్నారు. వచ్చే ఎన్టీఆర్‌ జయంతి రోజుకు ఎన్టీఆర్‌ను భారతరత్నతో సత్కరించుకోవాలని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ పాలనకు పెట్టింది పేరు ఎన్టీఆర్ అని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని బీజం వేసిన నేత అని అన్నారు తెలగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని రఘురామరాజు కొనియాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+