అమిత్ షా, పవన్ తో చంద్రబాబు 'లెక్కలు' వేరుగా ఉన్నాయ్!
తెలుగుదేశం-జనసేన కూటమికి భారతీయ జనతాపార్టీతో పొత్తు ఖరారవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబుకు ముందే తెలుసు. అంతేకాదు.. పొత్తులో భాగంగా ఏయే నియోజకవర్గాలు కేటాయించాలనే విషయంలో కూడా ఆయనకు కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారమే పొత్తులు కుదురుతాయి. ఇదంతా ఆయన ముందుగా రచించుకున్న రాజకీయ వ్యూహంలో భాగంగా సాగుతుంది.
చంద్రబాబునాయుడి వ్యూహాలు, ప్రతివ్యూహాల గురించి రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ముందుగానే ఒక ప్రణాళిక రచించుకొని, జాగ్రత్తగా దాన్ని అమలు చేసుకుంటూ వెళ్లడంలో ఆయన దిట్ట. చంద్రబాబు ప్రత్యర్థులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. తాజాగా జనసేన, బీజేపీతో పొత్తు విషయంలో కూడా ఆయన మరోసాని తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే పొత్తులో భాగంగా జనసేనకు టికెట్లు కేటాయించారు. ఆ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు బరిలోకి దిగుతున్నారు.

వాస్తవానికి పార్టీలో చేరాల్సిన వల్లభనేని బాలశౌరి, కొణతాల రామకృష్ణ, కొత్త పల్లి సుబ్బారాయుడు లాంటి నేతలను జనసేనలోకి పంపించడంతోపాటు వారు ఏ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగాలో కూడా చంద్రబాబు నిర్ణయించారు. ప్రస్తుతం బీజేపీ అడుగుతున్న సీట్ల విషయంలో రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ కూటమి నుంచి అధికారికంగా ధ్రువీకరణ వస్తేనే వాటిని పరిగణించాల్సి ఉంటుంది.
రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో బీజేపీ, జనసేనకు అసెంబ్లీ నియోజకవర్గాలు 30కి మించి దాటకూడదనేది చంద్రబాబు లెక్క. పొత్తులో భాగంగా కొన్ని సీట్లను వదులుకోవాల్సి ఉంటే కొంత వెనక్కి కూడా తగ్గుతారు. ఎందుకంటే ఈ రెండు పార్టీల తరఫున బరిలోకి దిగేవారు తనవారే అని చంద్రబాబుకు తెలుసు. సీట్ల విషయంలో సాధ్యమైనంత వరకు నియంత్రణ పాటిస్తారు. కేటాయించిన సీట్లలో సైతం తనవారినే నిలబెట్టి గెలిపించుకోగలిగే చాణక్యం ఆయన సొంతం. జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా అందుకనుగుణంగానే ఉంటాయి. కేవలం మనందరం చూస్తూ ఉండటమే.












Click it and Unblock the Notifications