పవన్ కల్యాణ్ కు హామీ ఇచ్చిన చంద్రబాబు?
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకోవడం దాదాపుగా ఖరారైందని చెప్పవచ్చు. ఇరుపార్టీల అధినేతలు అధికారికంగా ప్రకటించడమే తరువాయి. విశాఖపట్నం పరిణామాలపై చంద్రబాబు పవన్ కు సంఘీభావం తెలియజేయగా, కుప్పం పరిణామాలపై పవన్ కల్యాణ్ బాబుకు సంఘీభావం తెలియజేశారు. గతేడాది అక్టోబరులో సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాజాగా హైదరాబాద్ లో వీరిద్దరూ సమావేశమయ్యారు.
సీట్ల విషయమై తఖరారు నడుస్తోందని, తమకిన్ని సీట్లు కావాలని పవన్ కోరినట్లు, చంద్రబాబు కొన్ని తగ్గించి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయికానీ వాటిని ఇద్దరూ ఖండించడంలేదు. సీట్ల విషయం ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో జనసేనకు అభ్యర్థులు లేరు. అభ్యర్థులను నిలబెట్టేంత వనరులు లేవు. చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ముందుగా పొత్తు ఖరారైన నియోజకవర్గాల్లో జనసేన తన అభ్యర్థులను ప్రకటిస్తుంది. ఒకవేళ బలమైన అభ్యర్థులు దొరక్కపోతే ఆ బాధ్యతను తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. జనసేన తరఫున తానే స్వయంగా అభ్యర్థులను బరిలోకి దింపుతాననే స్పష్టమైన హామీని ఇచ్చినట్లు సమాచారం.

టీడీపీ, జనసేన కలిసి పొత్తు పెట్టుకోవడం ఖాయమైంది. అధినేతలిద్దరూ రెండుసార్లు కలిసినప్పుడు కచ్చితంగా పొత్తు ప్రస్తావన వస్తుందికానీ సమయానుకూలంగా వాటిగురించి చెబుతామని బాబు, పవన్ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు పవన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాపుజాతిని చంద్రబాబుకు తాకట్టు పెట్టారంటూ నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీ-వైసీపీ గా ఉన్న పోరు కాస్తా వైసీపీ-జనసేన పోరుగా మారింది. రాబోయే రోజుల్లో ఇరుపార్టీల మధ్య హోరాహోరీ సమరమే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications