కేసీఆర్ కు 'రిటర్న్ గిఫ్ట్' సిద్ధం చేస్తున్న చంద్రబాబు?

'రిటర్న్ గిఫ్ట్' అనే పదం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత హాట్ కేక్ లాంటిది. రాజకీయ వర్గాలతోపాటు ప్రజల్లో కూడా ఈ పదం ఎప్పుడూ నానుతూనే ఉంటుంది. అసలు ఈ పదం ఎందుకొచ్చింది? అనే విషయాన్ని తెలుసుకుందాం. 2018 తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలు కైవసం చేసుకొని రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఎవరైనా, ఎక్కడైనా పోటీచేయవచ్చు?

ఎవరైనా, ఎక్కడైనా పోటీచేయవచ్చు?

ఫలితాలు వెలువడిన రెండోరోజు సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జోక్యం చేసుకున్నారని, ఏపీ ఎన్నికల్లో తాము కూడా జోక్యం చేసుకొని బాబుకు 'రిటర్న్ గిఫ్ట్' ఇస్తామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో పోటీచేసింది. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మాట్లాడుతూ అక్కడ ఉండే ముఖ్యమంత్రి ఏపీ వచ్చి నాకేదో గిఫ్ట్ ఇస్తానంటున్నారు.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడికైనా వచ్చి పోటీచేయవచ్చన్నారు. అంతటితో ఆ వ్యవహారం ముగిసిపోయింది.

2019 ఎన్నికల్లో ఓటమే రిటర్న్ గిఫ్ట్?

2019 ఎన్నికల్లో ఓటమే రిటర్న్ గిఫ్ట్?

2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకు టీడీపీ 23 గెలుచుకొని ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎన్నికల్లో జగన్ కు పరోక్షంగా సహకరించడంద్వారా టీడీపీ ఓటమికి కేసీఆర్ కూడా ఒక కారకుడయ్యాడంటూ తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడంద్వారా కేసీఆర్ టీడీపీకి అవకాశం ఇచ్చారనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు సెంటిమెంట్ పేరుతో, ఆంధ్రా పార్టీగా చూపించి కేసీఆర్ ఓట్లు కొల్లగొట్టారని, ఇకనుంచి ఆ అవకాశం ఉండదన్నారు. అంతేకాకుండా టీడీపీ మద్దతు తీసుకోవడానికి ఇతర పార్టీలన్నీ నిన్నటివరకు సంకోచిస్తుండేవి. ఇకనుంచి ఆ అవకాశం లేదు.

రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కోసం పనిచేయడానికి..

రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కోసం పనిచేయడానికి..


మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీడీపీ మద్దతు కోరారని, ఆయన చంద్రబాబును కలవబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి టీడీపీ అభ్యర్థిని నిలబెట్టాలనుకున్నప్పటికీ బీజేపీకి మద్దతివ్వడం కోసమే వెనక్కి తగ్గిందనే వార్తలు వస్తున్నాయి. మునుగోడులో బీజేపీ గెలిస్తే రాష్ట్రవ్యాప్తంగా రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి సానుకూల పవనాలు వీస్తాయి. దీంతో అక్కడ గెలవడమనేది ఆ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోను బీజేపీ-టీడీపీ కలిసి పోటీచేసే పరిస్థితి ఉందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు బీజేపీ కోసం పనిచేస్తే సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీకి తిరుగుండదనే వాదన బలపడుతోంది. అదే జరిగితే తమ నాయకుడు కేసీఆర్ కు 'రిటర్న్ గిఫ్ట్' ఇచ్చినట్లేనని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. అప్పటివరకు మనం కూడా వేచిచూడక తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+