కడపపై చంద్రబాబు స్కెచ్

వచ్చే ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవిగా భావించడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. సహజశైలికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ముందే నిర్ణయించడంతోపాటు వరుసగా మూడుసార్లు ఓటమిపాలైన నేతలకు.. పనితీరు బాగోలేని నేతలకు, పనితీరు బాగోలేనివారికి మొహమాటం లేకుండా టికెట్లు నిరాకరిస్తున్నారు.

 కుప్పంలో జగన్.. కడపలో బాబు!

కుప్పంలో జగన్.. కడపలో బాబు!


చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడించడానికి ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారు. దీనికి విరుగుడుగా టీడీపీ జగన్ సొంత జిల్లా కడపపై దృష్టి కేంద్రీకరించింది. వచ్చే ఎన్నికల్లో కడపలో 80 శాతం సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రభుత్వ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేతలందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందనే భరోసా కల్పించడంతోపాటు పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటోంది. ఇటీవలే ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరగడంతోపాటు ఆయనపై అక్రమ కేసులు బనాయించడంతో మద్దతుగా లోకేష్ పర్యటించారు.

నేతలకు అండగా పార్టీ

నేతలకు అండగా పార్టీ


కడప సెంట్రల్ జైల్ కు చేరుకొని ప్రవీణ్ కుమార్ రెడ్డితోపాటు మరో 17 మందిని లోకేష్ ములాఖత్ లో కలిశారు. ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందనో భరోసా కల్పించారు. చంద్రబాబు కూడా కుప్పం నియోజకవర్గంలోని నేతలు చిత్తూరు జైల్లో ఉన్న సమయంలో వెళ్లి ములాఖత్ లో కలిశారు. న్యాయవాదులతో కలిసి బెయిల్ పై లోకేష్ చర్చించారు. తర్వాత జైలు నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి అభయమిచ్చారు. చంద్రబాబు సూచనల మేరకు లోకేష్ ఒకరోజు మొత్తం కేటాయించారు. అనంతరం ఆయన కడప జిల్లాకు చెందిన పార్టీ నేతలందరితో జిల్లాలో పార్టీ గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించారు.

5 స్థానాల్లో కచ్చిత విజయం సాధించాలి!

5 స్థానాల్లో కచ్చిత విజయం సాధించాలి!


కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతను ఆసరాగా చేసుకొని ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్, రాజంపేట, జమ్మలమడుగు స్థానాల్లో విజయం సాధించడాలని టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రతి నెలా చంద్రబాబుకానీ, లోకేష్ కానీ, ఇతర సీనియర్ నేతలుకానీ కడప జిల్లాలో పర్యటిస్తూ స్థానిక నాయకులను సమన్వయం చేసుకొని గెలుపుకు బాటలు పరవాలని నిర్ణయించారు. అధికార పార్టీ నుంచి కుప్పంపై ఎంత ఒత్తిడి పెంచాలని భావిస్తారో అంతకు రెట్టింపు సంఖ్యలో కడప జిల్లాపై ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+