చంద్రబాబు కు జాతీయ స్థాయిలో మూడో స్థానం..!!
దేశంలోని ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం జగన్ అధిక ధనవంతుడిగా తొలి స్థానంలో నిలిచారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తులను బహిర్గతం చేసిన ఏడీఆర్ సంస్థ అదే సమయంలో రిచెస్ట్ ఎమ్మెల్యేల జాబితాను బయట పెట్టింది. అందులో చంద్రబాబుకు జాతీయ స్థాయిలో మూడో స్థానం దక్కింది. దేశంలో రిచెస్ట్ ఎమ్మెల్యేగా చంద్రబాబు మూడో స్థానంలో ఉన్నారు. ఏపీలో తొలి స్థానంలో నిలిచారు. జగన్ ఆస్తుల విలువ రూ 510 కోట్లుగా సంస్థ వెల్లడించింది. చంద్రబాబు ఆస్తుల విలువ రూ 668 కోట్లుగా చెబుతున్నారు.
ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఏడీఆర్ బయట పెట్టిన రిచెస్ట్ సీఎంల జాబితా పైన చర్చ సాగుతోంది. ఆ జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ రూ 510 కోట్లతో తొలి స్థానంలో నిలిచారు. రూ 15 లక్షలతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చివరి స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రులు సమర్పించిన వ్యక్తిగత ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా ఈ జాబితాను వెల్లడించారు.

ఇప్పుడు ఎమ్మెల్యేల జాబితా బయటకు వచ్చింది. అందులో ఏపీలో అందరి ఎమ్మెల్యేలకంటే చంద్రబాబు రిచెస్ట్ గా వెల్లడైంది. చంద్రబాబు ఆస్తి రూ 668 కోట్లుగా ఏడీఆర్ నివేదికలో స్పష్టం అయింది. దేశంలో చంద్రబాబు మూడో స్థానంలో ఉన్నారు. ఏడిఆర్ నివేదిక మేరకు తొలి స్థానంలో ఎన్ నాగరాజు నిలవగా, రెండో స్థానంలో డీకే శివకుమార్ నిలిచారు.
ముఖ్యమంత్రుల జాబితాతో జగన్ పేరు తొలి స్థానంలో నిలవటంతో టీడీపీ శ్రేణులు ఈ అంశాన్ని పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేసారు. ఇప్పుడు చంద్రబాబు ఆస్తుల వివరాల గురించి వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైర్ అవుతోంది. దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 97 శాతం.. అంటే 29 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఒక్కో ముఖ్యమంత్రి సగటు ఆస్తి రూ.33.96 కోట్లుగా ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది.

ఏపీ సీఎం తరువాతి స్థానాల్లో వరుసగా రూ.163 కోట్లతో అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రెండో స్థానంలో.. రూ.63 కోట్లతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మూడో స్థానంలో ఉన్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ఆస్తులు రూ.23 కోట్లు అని ఏడీఆర్ నివేదకలో స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications